2024-06-22 15:24:36
Taliban Government : తాలిబాన్ల ప్రభుత్వంలో 14 మంది ఉగ్రవాదులే..! – Sirimalli.com

Taliban Government : తాలిబాన్ల ప్రభుత్వంలో 14 మంది ఉగ్రవాదులే..!

Taliban Government : గత నెలలో ఆఫ్గనిస్తాన్ ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇటీవల తాత్కాలిక ప్రభుత్వాన్ని(Taliban Government ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో 14 మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఇందులో నూతన ప్రధానమంత్రి ముల్లా మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌తోపాటు ఇద్దరు ఉపప్రధానుల పేర్లు సైతం ఉండడం కూడా గమనార్హం.

ఐక్యరాజ్యసవిుతికి చెందిన భద్రతా మండలి వారిని గతంలోనే టెర్రరిజం బ్లాక్‌లిస్టులో చేర్చింది. డ్రగ్స్‌ మాఫియా, హత్యలు, ఉగ్రవాద కార్యకలాపాలు లాంటి హీనమైన చర్యలకు పాల్పడిన వారినే ఈ జాబితాలోకి ఐరాస చేరుస్తుంది. నూతన ప్రధాని ముల్లా మొహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌.. గత తాలిబాన్ల ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు.

ఇతను తాలిబన్‌ వ్యవస్థాపకుడు మల్లా ఒమర్‌కు సన్నిహితుడు. ఇతని పేరును ఐక్యరాజ్యసవిుతి ఎప్పుడో బ్లాక్‌లిస్టులో చేర్చింది. ఇతనితో పాటుగా రక్షణ శాఖ మంత్రి ముల్లా యాకూబ్, విదేశాంగ మంత్రి ముల్లా అమీర్‌ ఖాన్‌ ముత్తాఖీ, విదేశాంగ శాఖ సహాయ మంత్రి షేర్‌ మొహమ్మద్‌ అబ్బాస్‌ స్టానిక్‌జాయ్‌ తదితరులను ఐక్యరాజ్యసమితి గతంలోనే బ్లాక్ లిస్టులో చేర్చింది.

ఇందులో ముల్లా యాకూబ్‌.. తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ కొడుకు కావడం విశేషం. కాగా ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త క్యాబినెట్ కూర్పుపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. తాత్కాలిక క్యాబినెట్‌లో ఏ మహిళకి కూడా చోటు దక్కలేదు.

Also Read :