SP Balu : దుబాయ్‌ షేక్‌ నోట.. బాలు పాట.. !
Cinema Latest

SP Balu : దుబాయ్‌ షేక్‌ నోట.. బాలు పాట.. !

SP Balu : లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి.. వివిధ బాషలలో కలిపి ఆయన నలబై వేలకి పాటలు పాడి ప్రపంచవ్యాప్తంగా అభిమానులును సంపాదించుకున్నారు. బాలు(SP Balu ) లేకుండా తెలుగు పాటని మనము ఊహించుకోలేము కూడా.

అయితే అనారోగ్య కారణంగా గత ఏడాది కన్నుమూశారు బాలు… ప్రస్తుతం భౌతికంగా బాలు మన మధ్య లేకున్నా.. పాటల రూపంలో ఎప్పుడు మన మధ్యే ఉంటారని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. అందుకు నిదర్శనమే ఈ దుబాయ్ షేక్. ఎస్పీ బాలు పాడిన ఓ మధురగీతాన్ని ఈ దుబాయ్ షేక్ ఏ మాత్రం తడబడకుండా పాడి అదరగొట్టేశాడు.

అందులోనూ మళ్ళీ సంక్లీష్టమైన పాటను ఎంచుకోవడం అంటే మాములు విషయం కాదు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో, కె.వి.మహదేవన్‌ సంగీతం సారధ్యంలో తెరకెక్కిన ‘సిరివెన్నెల’ చిత్రంలోని ‘విధాత తలపున..’ అంటూ సాగే పాటను దుబాయ్ షేక్ ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోని ఆయన టిక్‌టాక్‌లో షేర్‌ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు దుబాయ్ షేక్ ని అభినందించక ఉండలేకపోతున్నారు.

Also Read :