2024-07-27 02:20:12
Neha Shetty: అల్లు అర్జున్‌తో ‘డీజే’ టిల్లు భామ.. బంఫర్ ఆఫర్ కొట్టేసిందిగా.. – Sirimalli.com

Neha Shetty: అల్లు అర్జున్‌తో ‘డీజే’ టిల్లు భామ.. బంఫర్ ఆఫర్ కొట్టేసిందిగా..

Neha Shetty: ఈరోజుల్లో ఇండస్ట్రీలోకి వచ్చిన చాలావరకు నటీనటులు గుర్తింపు కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. సరైన హిట్ ఒక్కటి పడితే.. కెరీర్ స్టార్టింగ్‌లోనే వారి లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఇటీవల సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఎందరో నటీమణులే దీనికి ఉదాహరణ. ఆ లిస్ట్‌లోకి ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యింది ‘డీజే టిల్లు’ భామ నేహా శెట్టి (Neha Shetty).

Neha Shetty
Neha Shetty

నేహా శెట్టి అంటే కొంతకాలం క్రితం వరకు ఎవ్వరికీ పెద్దగా తెలియదు. కానీ తన కెరీర్ మాత్రం చాలా గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. పూరీ జగన్నాధ్ లాంటి డైనమిక్ దర్శకుడు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చి తనను హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందు నిలబెట్టాడు. పూరీ జగన్నాధ్‌తో సినిమా చేసే ముందు నేహా.. తన మాతృభాషలోనే కన్నడలోనే ఓ చిత్రం చేసింది.

Neha Shetty
Neha Shetty

ఇక 2018లో పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘మెహబూబా’ చిత్రం తెలుగులో తనకు మంచి డెబ్యూనే ఇచ్చింది. అందులో తన పాత్ర కూడా చూసే ప్రేక్షకులకు చాలావరకు నచ్చేలా ఉంటుంది. కానీ సినిమా సరిగ్గా కమర్షియల్ సక్సెస్ సాధించకపోవడంతో నేహా గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదు. అందుకే తనకు టాలీవుడ్‌లో మరో అవకాశం రావడానికి కూడా చాలా సమయమే పట్టింది.

Also Read: https://www.sirimalli.com/suma-kanakala-dance/

Neha Shetty
Neha Shetty

మూడేళ్ల గ్యాప్ తర్వాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘గల్లీ రౌడీ’ సినిమాతో మరోసారి అందరినీ మెప్పించే ప్రయత్నం చేసింది నేహా శెట్టి. ఈ మూవీ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఇదే తనకు ‘డీజే టిల్లు’ ఛాన్స్‌ను కూడా తెచ్చిపెట్టింది. ‘డీజే టిల్లు’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది నేహా. ప్రస్తుతం తనకు ఫుల్‌గా ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చేస్తున్నాయి. అలాగే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun)తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని దక్కించుకుంది నేహా.

తాజాగా అల్లు అర్జున్ జొమాటోకు బ్రాండ్ అంబాసడర్‌గా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫుడ్ డెలివరీ యాప్ ఎక్కువమందికి రీచ్ అవ్వడానికి తమ ప్రకటనలను కూడా చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే నేహా శెట్టి, అల్లు అర్జున్‌తో కలిసి ఓ యాడ్ షూట్ చేసింది. ఆ యాడ్ ఇప్పుడు నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు బన్నీతో కలిసి యాడ్ చేసిన నేహా.. ఏదో ఒకరోజు సినిమా కూడా చేస్తుందని తన అభిమానులు ఆశిస్తున్నారు.

Zomato Ad: https://www.instagram.com/tv/CauOEZ1J28C/?utm_source=ig_web_copy_link