Suma Kanakala: ట్రెండ్‌ను ఫాలో అవుతున్న సుమ.. నెట్టింట్లో వీడియో వైరల్..
Cinema Latest

Suma Kanakala: ట్రెండ్‌ను ఫాలో అవుతున్న సుమ.. నెట్టింట్లో వీడియో వైరల్..

Suma Kanakala: ప్రస్తుతం ఏ విషయం అయినా కాస్త ట్రెండ్ అయితే చాలు.. ప్రతీ ఒక్కరు కచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాల్సిందే.. సెలబ్రిటీలు అయినా.. మామూలు నెటిజన్లు అయినా.. ఆ ట్రెండ్‌ను ఫాలో అవ్వడం ఆనవాయితీగా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారంతా ఆ ట్రెండ్‌ను ఫాలో అవ్వనిదే ముద్దు దిగదు అన్నట్టుగా ఉంటారు. అయితే తాజాగా అలా ట్రెండ్ అవుతున్న ఓ పనిని యాంకర్ సుమ కూడా చేసి అందరినీ ఇంప్రెస్ చేసింది.

యాంకర్ సుమ అలియాస్ సుమ కనకాల (Suma Kanakala).. బుల్లితెరపై ఎక్కడ చూసినా తన పేరే. ఈవెంట్స్‌లో, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లో, ఇంటర్వ్యూలలో.. ఫన్ కావాలంటే సుమ ఉండాల్సిందే. అలాంటి సుమ డైరీ ఎప్పుడూ బిజీ షెడ్యూల్స్‌తో నిండిపోయి ఉంటుంది. బుల్లితెరపై ఎక్కువ బిజీ అవ్వడం వల్లే తానెప్పుడు వెండితెర ఎలా ఉంటుందో చూడాలని ట్రైల చేయలేదనుకుంటా అనిపిస్తుంది. అలాంటి సుమ సోషల్ మీడియాలో కూడా చాలానే యాక్టివ్.

తన ఈవెంట్ సమయంలో రెడీ అవ్వగానే ఫోటోషూట్ చేసి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం చేస్తూ ఉంటుంది. పైగా తన ఫ్యామిలీ ఫోటోలను కూడా ఎంతో హ్యాపీగా తన ఫాలోవర్స్ ముందు పెడుతుంది సుమ. తమ ఫ్యామిలీ వెకేషన్స్ గురించి, అప్డేట్స్ గురించి తెలియాలంటే సుమ సోషల్ మీడియా చూడాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. అలాంటి సుమ తాజాగా తన సోషల్ మీడియాలో ఓ డ్యాన్స్ వీడియోను అప్‌లోడ్ చేసింది.

Also Read: https://www.sirimalli.com/today-07-march-2022-daily-horoscope-in-telugu/

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. బీస్ట్ సినిమాలోని ‘అరబిక్ కుతు’పాటే వినిపిస్తోంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు, భాషతో సంబంధం లేకుండా నెటిజన్లు అందరూ ఈ పాటకు తమ స్టైల్ డ్యాన్స్‌తో మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సుమ కూడా అదే చేసింది. షూట్ మధ్య ఖాళీ సమయం దొరికినప్పుడు అరబిక్ కుతు పాటకు స్టెప్పులేసింది సుమ. ప్రస్తుతం ఈ వీడియో తన ఫ్యాన్స్‌కు తెగ నచ్చేస్తోంది.

Suma Dance Video: https://www.instagram.com/p/Caj_3JaJKzR/

Also Read : 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి వారం మధ్యలో ఆకస్మిక ధనలాభ సూచనలు (06-03-2022 నుండి 12-03-2022) వరకు..

 

Immune Food : ఏ టైమ్ లో ఏం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. 40 ఏళ్లు దాటినా..

 

For More Updates Follow us on – Sirimalli Page