Bigg Boss 5 Telugu Nagarjuna : రేటు పెంచిన నాగ్.. బిగ్ బాస్ 5 కి షాకింగ్ రెమ్యునరేషన్..!
Bigg Boss 5 Telugu Latest

Bigg Boss 5 Telugu Nagarjuna : రేటు పెంచిన నాగ్.. బిగ్ బాస్ 5 కి షాకింగ్ రెమ్యునరేషన్..!

Bigg Boss 5 Telugu Nagarjuna : నార్త్ లో ఫుల్ పాపులర్ అయిన బిగ్ బాస్ షోకి ఇప్పుడు సౌత్ లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. తెలుగులో సక్సెస్ ఫుల్ గా నాలుగు సీజన్స్ ని కంప్లీట్ చేసుకుంది. ఇందులో గత మూడు,నాలుగు సీజన్లను సక్సెస్ చేయడంలో హోస్ట్ నాగార్జున(Bigg Boss 5 Telugu Nagarjuna)ది కీలకపాత్ర అని చెప్పాలి.

ప్రేక్షకులకు నచ్చే, మెచ్చే రీతిలో మాట్లాడుతూ వారిని అలరించాడు నాగ్. అందుకే తాజాగా ఐదో సీజన్‌కు మరొకరి కోసం సెర్చింగ్ మొదలుపెట్టకుండా నాగ్ కే హోస్టింగ్‌ బాధ్యతలు అప్పజెప్పారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే ఈ సీజన్ కి గత రెండు సీజన్స్ కంటే ఈ సారి నాగ్ రెమ్యునరేషన్ పెంచినట్టుగా తెలుస్తోంది.

106 రోజులపాటు కొనసాగనున్న ఈ సీజన్‌కు రూ.12 కోట్ల మేర పారితోషికం తీసుకోనున్నట్లుగా సమాచారం. గతంలో వీకెండ్‌లో ప్రసారమయ్యే ఒక్క ఎపిసోడ్‌కు సుమారు రూ.12 లక్షలు పైగా తీసుకున్న నాగ్‌.. ఈసారి మాత్రం ఓ రేంజ్‌లో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

తనదైన మార్క్ తో హౌస్ ని కంట్రోల్ చేయడం, షోని రక్తి కట్టించడంలో ప్రేక్షకుల చేత నాగ్ శభాష్ అనిపించుకోవడంతో నాగ్ డిమాండ్ కి కూడా బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఒకే చెప్పినట్టుగా తెలుస్తుంది. నాగ్ డిమాండ్ చేసిన 12 కోట్లు ఇవ్వడానికి కూడా నో చెప్పలేదట.

కాగా ఈ సీజన్ లో మొత్తం 19 మంది సభ్యులతో హౌజ్ కళకళలాడుతుంది. ఇందులో యాంకర్ రవి, యూట్యూబర్ సరయు, యానీ మాస్టార్, సీరియల్ హీరో మానస్, ఆర్జే కాజల్, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, సీరియల్ నటి ప్రియ, నటరాజ్ మాస్టార్, నటి శ్వేత వర్మ, లహరి, నటుడు విశ్వ, సింగర్ శ్రీరామచంద్ర, కార్తీకదీపం ఉమాదేవి, శ్వేతా వర్మ, లోబో, సిరి హన్మంత్, జబర్దస్త్ ప్రియాంక, జెస్సీ, హమిద ఉన్నారు.

Also Read :

For More Updates Follow us on – Sirimalli Page