2024-07-27 10:51:29
Hero Nani : నాని.. హిట్ సినిమాలను కావాలనే వదిలేశాడట..! – Sirimalli.com

Hero Nani : నాని.. హిట్ సినిమాలను కావాలనే వదిలేశాడట..!

Hero Nani : ఓ హీరో చేయాల్సిన సినిమాని మరో హీరో చేయడం అనేది ఇండస్ట్రీలో సర్వసాధారణమైన విషయం.. కానీ పక్కా హిట్ అవుతుందనుకుంటే ఏ హీరో కూడా సినిమాని వదులుకోడు.. కానీ హీరో నాని అందుకు విరుద్దంగా ఉన్నాడు. ఓ రెండు సినిమాలు పక్కగా హిట్ అవుతాయని తెలిసి కూడా వదిలేశాడట.. అవే రాజారాణి, ఎఫ్ 2 సినిమాలు.

ముందుగా రాజారాణి చిత్రం నాని దగ్గరికే వచ్చిందట.. అయితే అ టైంలో నాని.. పైసా, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ సినిమాని వదిలేశాడట.. లేకపోతే దర్శకుడు అట్లీని తానే ఇండస్ట్రీకి పరిచయం చేసేవాడినని నాని చెప్పుకొచ్చాడు. సినిమా హిట్ మాత్రమే కాదు.. పక్కా పెద్ద దర్శకుడివి అవుతావని కూడా చెప్పాడట.. అనుకున్నట్టుగానే అట్లీ టాప్ డైరెక్టర్‌‌ల లిస్ట్‌‌లో ఒకడిగా చేరిపోయాడు.

ఇక ఎఫ్2 కథ విన్నప్పుడే ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని దర్శకుడు అనిల్, నిర్మాత దిల్ రాజులకి చెప్పేశాడట. కాకపోతే అది నా స్పేస్ కాదని అనుకున్నానని, అందుకే ఆ సినిమాని చేయలేకపోయానని చెప్పుకొచ్చాడు నాని. ఇలా తాను మిస్సయిన రెండు సూపర్ హిట్ సినిమాల్ని బయటపెట్టాడు నాని.

ఇక తాను పక్కా హిట్ అవుతాయని నమ్మిన సినిమాలు మాత్రం ప్లాప్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. అవే.. పైసా, ఆహా కల్యాణం, వీ సినిమాలు. ఇదిలావుండగా ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాతో మరోసారి ఓటీటీలోకొస్తున్నాడు నాని. ఓటీటీలో నేరుగా రిలీజయ్యే ఆఖరి సినిమా ఇదే కావాలని కోరుకుంటున్నట్టుగా తెలిపాడు.

Also Read :