AP Government : సర్కారు వారి ‘మటన్ షాపులు, ధియేటర్లు’..!
Latest Politics

AP Government : సర్కారు వారి ‘మటన్ షాపులు, ధియేటర్లు’..!

AP Government :ఏపీ ప్రభుత్వం మరో వినూత్న ఆలోచనకి శ్రీకారం చుట్టనుంది. దేశంలోనే తొలిసారిగా మొబైల్ మాంసం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కడైనా మటన్ అమ్ముకునే విధంగా వ్యాన్లను సిద్దం చేస్తుంది. ఇందులోనే మేకలను గొర్రెలను విక్రయిస్తారు. ఆరోగ్యకరమైన మేక, గొర్రె మాంసం, తలకాయ, కాళ్ళు, బోటీవి అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రభుత్వం(AP Government ) ఏర్పాట్లు చేస్తుంది.

వ్యర్థ పదార్థాలను నిల్వ చేసేందుకు వాహనంలోనే డంపింగ్‌ సౌకర్యం ఉంటుంది. ఏపీ మీట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో యూనిట్‌ రూ.10 లక్షల అంచనా వ్యయంతో తొలిదశలో మహానగరాలు, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో 112 యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. అనంతరం రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు వీటిని విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు.

విశాఖ, విజయవాడ నగరాల్లో నాలుగు, మిగిలిన కార్పొరేషన్ల పరిధిలో రెండు, ఇతర మునిసిపాల్టీల పరిధిలో ఒక్కటి చొప్పున సబ్సిడీతో కూడిన గ్రాంట్‌తో వీటిని ఏర్పాటు చేయనున్నారు. 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తు కలిగిన మొబైల్‌ మటన్‌ విక్రయాల వాహనాన్ని ఎక్కడికైనా సులభంగా తరలించేందుకు వీలుగా డిజైన్‌ చేశారు.

అటు రాష్ట్రంలోని థియేటర్లలో సినిమా టికెట్లను ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే విక్రయించనుంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ యాప్ ని తీసుకురానుంది ప్రభుత్వం. రైల్వే, ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ విధానంలో పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురానుంది ప్రభుత్వం. ఏపీ ఫిల్మ్‌, టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ దీన్ని నిర్వహించనుంది. ఆ పోర్టల్‌ ద్వారా సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మనుంది.

దీనితో ఇక నుంచి ఏపీ సినిమా హాళ్ళలో టిక్కెట్ల బుకింగ్ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లనుంది. వచ్చే కలెక్షన్ అంతా ప్రభుత్వం చేతుల్లోనికే వెళ్తుంది. ప్రతి నెలా 30 వ తారీఖున పన్నులు మినహాయించి థియేటర్ యాజమాన్యాలకు వాళ్ళ వాటా చెల్లించే అవకాశం ఉంది. అప్పటిదాకా డబ్బులన్నీ ప్రభుత్వం దగ్గరే ఉండనున్నాయి.

Also Read :