2024-05-29 06:43:40
Hiccups Solution : వెక్కిళ్లను అడ్డుకునే కొత్త రకం స్ట్రా.. దీని రేటు ఎంతంటే.. – Sirimalli.com

Hiccups Solution : వెక్కిళ్లను అడ్డుకునే కొత్త రకం స్ట్రా.. దీని రేటు ఎంతంటే..

Hiccups Solution : మీకు ఉన్నట్టుండి సడన్ గా ఎక్కిళ్లు వస్తాయి. వెంటనే మీరు ఏం చేస్తారు? అయితే ఓ గ్లాసు నీళ్లు తాగుతారు. లేదంటే.. బామ్మ చెప్పే నిమ్మకాయ, అల్లం ముక్కలాంటివి నములుతారు. ఇవీ కాదనుకుంటే మరికొన్ని చిట్కాలను పాటిస్తారు. అంతవరకే అందరికీ తెలుసు. కొంతమందికి ఇవేం చేసినా ఎక్కిళ్లు (Hiccups Solution) తగ్గక చాలా ఇబ్బంది పెడతాయి. కాని వాటిని ఆపే టెక్నాలజీని తయారుచేశారు శాస్త్రవేత్తలు.

Never hitch again? This straw is supposed to solve the eternal problem of hiccups

ఎక్కిళ్లు తగ్గక ఊపిరి తీసుకోవడానికి కూడా కొంతమంది ఇబ్బంది పడతారు. అలాంటివాటికి పరిష్కారం, అలాంటివారికి ఉపశమనం కలిగించే టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. అదే.. కొత్త స్ట్రా. అయినా స్ట్రాతో ఎక్కిళ్లు ఎలా ఆగుతాయిరా బాబు అనుకోవచ్చు. కాని ఇది కొబ్బరిబొండాం నీళ్లకో, జ్యూసులు తాగడానికో ఉపయోగించే స్ట్రా కాదు. ఎక్కిళ్లు తగ్గించడానికి టెక్నాలజీ సాయంతో శాస్త్రవేత్తలు తయారుచేసిన ప్రత్యేకమైన స్ట్రా.

US scientists create $14 straw as instant cure for hiccups, in India we have a priceless trick for free | Health Tips and News

నిజానికి ఎక్కిళ్లను చాలా చిన్న సమస్యగా చాలామంది చూస్తారు. కాని కొంతమందికి ఇదే ప్రాణసంకటంగా ఉంటుంది. పైగా పదే పదే ఎక్కిళ్లు వస్తే.. నీళ్లు తాగడానికి కూడా అవ్వదు. ఎందుకంటే అప్పటికే పొట్టంతా నీటితో నిండిపోయి ఉంటుంది. అందుకే అలాంటివాళ్లకు ఈ స్ట్రా ఓ వరమనే చెప్పాలి.

ఈ L(ఎల్) షేప్‌ స్ట్రాతో చాలా ప్రయోజనం ఉంది. దీంతో నీళ్లను అలా అలా సిప్‌ చేస్తే చాలు. వెంటనే ఎక్కిళ్లు ఆగిపోతాయి. అమెరికా శాస్త్రవేత్తలు తయారుచేసిన ఈ స్ట్రాకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఈ పరికరానికి ఓ పేరు కూడా పెట్టారు. ‘ద ఫోర్స్‌డ్‌ ఇన్‌స్పిరేటరీ సక్షన్‌ అండ్‌ స్వాలో టూల్‌’. దీని పేరు కూడా ఈ స్ట్రాలాగే చాలా పొడుగ్గా ఉంది కదా.

This magic straw will cure your hiccups - The Gadgeteer

ఈ స్ట్రా చూడ్డానికి చిన్న గొట్టంలాగే కనిపిస్తుంది. కానీ దీనికి ఒకవైపు మౌత్ పీస్, మరోవైపు ప్రెషర్ వాల్వ్ ఉంటాయి. ఇప్పటికే దీనిని 249 మందిపై ప్రయోగించారు కూడా. పైగా రిజల్ట్ కూడా 92 శాతం సమర్థవంతంగా పనిచేసిందని చెబుతోంది. అంటే ఈ స్ట్రాతో నీటిని సిప్ చేస్తే చాలు.. ఎక్కిళ్లు ఆగిపోయినట్టే. ఇవి ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి. ఆకుపచ్చ, నీలం, బూడిద రంగుల్లో లభ్యమవుతున్నాయి.

Forced Inspiratory Suction and Swallow Tool | HiccAway

 

రేటు చెబితే కాస్త ఎక్కువనుకుంటారు కాని.. దీని ఉపయోగం అలాంటిది. ప్రస్తుతం దీని ఖరీదు.. వెయ్యి రూపాయిల నుంచి రెండు వేల రూపాయిలకు పైగా ఉంది. ఆన్ లైన్ లో కూడా దొరుకుతోంది. ఒక స్ట్రా రేటు ఇంతుంటుందని జీవితంలో ఎవరూ ఊహించి ఉండరు. కానీ తరచూ వచ్చే ఎక్కిళ్లతో బాధపడేవారికి మాత్రం ఇది చాలా ఉపయోగకరమని చెప్పచ్చు.

ఇవి కూడా చదవండి : 

Also Read : International Yoga Day : మీరు ఊపిరి తీసుకునే విధానాన్ని బట్టి.. మీ ఆయుష్షును చెప్పే యోగ.. అదెలా అంటే..

Also Read : International Yoga Day : యోగాలో 84 లక్షల ఆసనాలు!.. ఏ వయసువారు ఎలాంటి యోగాసనాలు వేయవచ్చంటే..

Also Read : Satya Nadella : ఆ ఐదు అంశాలే.. మైక్రో సాఫ్ట్ ఛైర్మన్ సత్యనాదెళ్ల జీవితాన్ని మార్చేశాయి

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage