prashanth kishor with kcr : ప్రగతి భవన్ లో ప్రశాంత్ కిషోర్.. కేసీఆర్ కి ఆ 89 మంది జాతకాలు ఇచ్చారా?

prashanth kishor with kcr : ప్రగతి భవన్ లో ప్రశాంత్ కిషోర్ దర్శనమిచ్చేసరికీ తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి జాతీయస్థాయిలో సేవలు అందించడానికి సిద్ధమయ్యారు. దీనికోసమే కొద్ది రోజులుగా సోనియా అండ్ టీమ్ తో రోజూ మంతనాలు సాగిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టే. కానీ ఆయన సేవలు పూర్తిగా కాంగ్రెస్ కే పరిమితం కావాలని సోనియా కండీషన్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో పీకే.. ప్రగతి భవన్ లో కనిపించడం ఒక్కసారిగా ఆసక్తిని పెంచింది.

కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ ఇద్దరూ రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఈ చర్చలు కొనసాగినట్లు సమాచారం. ఆయన ప్రగతి భవన్ లోనే బస చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం కూడా ఆయన అక్కడే ఉంటారని.. వీలైతే ఆదివారం రాత్రి లేదా సోమవారం ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. ఈలోపు పార్టీ పరిస్థితిపైనా, పటిష్టతపైనా పూర్తిస్థాయిలో చర్చలు జరుగుతాయి.

టీఆర్ఎస్ తో ఇప్పటికే పీకేకు రాజకీయ ఒప్పందం ఉంది. అందుకే టీఆర్ఎస్ పాలనతోపాటు, రాజకీయ పరిస్థితులపై తెలంగాణలో సర్వే చేయించారు. ఈ రిపోర్ట్ ను కేసీఆర్ కు సమర్పించారు. ఇంతకుముందే 30 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్ ను కేసీఆర్ కు ఇచ్చారు. ఇప్పుడు 89 నియోజకవర్గాల సర్వే ఫలితాలను కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. తాను సోనియా టీమ్ తో జరిపిన చర్చల సారాంశాన్ని కూడా కేసీఆర్ తో ప్రస్తావించినట్లు సమాచారం. కాకపోతే ముందుగానే టీఆర్ఎస్ తో ఒప్పందం చేసుకున్నందున ఆమేరకు పార్టీతో కలిసి పని చేస్తానని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.

ప్రశాంత్ కిషోర్ పక్కా రాజకీయ నాయకుడు కాదు. కానీ రాజకీయం ఎలా చేయాలో తెలుసు. ఏం చేస్తే.. రాజకీయాల్లో నెగ్గుకొచ్చి.. గెలవచ్చో ఆయనకు బాగా తెలుసు. అందుకే ఎన్నికల వ్యూహకర్తగా అంతటి పేరు సంపాదించారు. అటు కేసీఆర్ కు రాజకీయం ఎలా చేయాలో తెలుసు. ప్రత్యర్థులను రాజకీయంగా ఎలా దెబ్బతీయచ్చో తెలుసు. కాకపోతే సోషల్ మీడియా పరంగా ఇంకా పార్టీని ఎదిగేలా చేయాల్సి ఉంది. అందుకే ప్రశాంత్ కిషోర్ సేవలను పొందుతున్నారు.

Also Read :

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Weekly Horoscope Telugu : ఆ రాశుల వారికి అనుకున్న సమయానికి ధన సహాయం (24-04-2022 నుంచి 30-04-2022)

Immune Food : ఏ టైమ్ లో ఏం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. 40 ఏళ్లు దాటినా..

 

For More Updates Follow us on – Sirimalli Page