Today Horoscope : ఆ రాశివారికి వ్యాపార ఉద్యోగాలలో అవకాశాలు (26-04-2022)
Bhakthi Latest

Today Horoscope : ఆ రాశివారికి వ్యాపార ఉద్యోగాలలో అవకాశాలు (26-04-2022)

Today Horoscope : ఆ రాశివారికి వ్యాపార ఉద్యోగాలలో అవకాశాలు (26-04-2022)

 

SREE KRUPA (26-04-2022) రాశి ఫలితాలు

 

మేషం – 26-04-2022

Today Horoscope : అవసరానికి స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది చేపట్టిన వ్యవహారాల్లో విజయం పొందుతారు శుభకార్య ఆహ్వానాలు అందుతాయి మొండి బాకీలు వసూలు అవుతాయి సంతానం విద్యా విషయాల లో ఉత్తమ ఫలితాలు పొందుతారు వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం – 26-04-2022

ఆర్థికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో అప్రయత్నంగా అవకాశాలు పొందుతారు. నూతనకార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

మిధునం – 26-04-2022

చిన్న చిన్న విషయాలు మనసుకు బాధ కలిగిస్తాయి ధన వ్యవహారాలు ఒడిదుడుకుగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మాటలు వివాదాస్పదంగా మారుతాయి. దూరప్రయాణం సూచనలు ఉన్నవి. ఉద్యోగాల్లో వివాదాలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

కర్కాటకం – 26-04-2022

కొత్త బాధ్యతలుపెరుగుతాయి.చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు .ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి ఆర్థికంగాపరిస్థితి మరింత నిరుత్సాహ పరుస్తుంది. సోదరులతో సమన్వయం లోపిస్తుంది.

సింహం – 26-04-2022

చేపట్టిన వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభం కలిగిస్తాయి. రావలసిన ధనం సమయానికి అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సత్ఫలితాలు పొందుతారు.

కన్య – 26-04-2022

చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కొన్ని వ్యవహారాలలో అనుకున్నవిధంగా పూర్తిచేస్తారు. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

తుల – 26-04-2022

చేపట్టినపనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా రుణ ప్రయత్నాలు కలసిరావు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు ఉంటాయి నూతన వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

వృశ్చికం – 26-04-2022

కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి.ధన వ్యయసూచనలుఉన్నవి.స్థిరాస్తి వివాదాల లో రాజీ ప్రయత్నాలు విఫలం అవుతాయి.ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు.

ధనస్సు – 26-04-2022

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలులభిస్తాయి.వాహన కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారం పురోగతి కలుగుతుంది. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక ఋణాలు తీరుస్తారు.

మకరం – 26-04-2022

పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులెదురవుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూలత పెరుగుతుంది.

కుంభం – 26-04-2022

చేపట్టిన పనులు బంధుమిత్రుల సహాయ సహకారంతో సజావుగా పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార పరంగా నూతన ప్రణాళికలను అమలు పరిచి విజయం సాధిస్తారు.

మీనం – 26-04-2022

వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగ విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆకస్మిక ప్రయాణం సూచనలు ఉన్నవి. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. సమాజంలో కొందరు ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.


Girish Panthulu sirimalli.com

Girish Panthulu sirimalli.com

Weekly Horoscope Telugu : ఆ రాశుల వారికి అనుకున్న సమయానికి ధన సహాయం (24-04-2022 నుంచి 30-04-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page