Director Shankar : వామ్మో శంకర్.. ఒక్క పోస్టర్ కే అంత ఖర్చు పెట్టించాడట…!
Cinema Latest

Director Shankar : వామ్మో శంకర్.. ఒక్క పోస్టర్ కే అంత ఖర్చు పెట్టించాడట…!

Director Shankar : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar) కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ తేజ్ సరసన కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

Image

ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఈరోజు జరిగాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో రామ్‌చరణ్‌, కియారాలతో పాటు డైరెక్టర్‌ శంకర్‌, దిల్‌ రాజు, సునీల్‌, అంజలి, శ్రీకాంత్‌ సహా మిగిలిన కాస్ట్‌ ఉన్నారు.

Image

అందరూ సూటూ బూటూ వేసుకుని యమ స్టైలిష్ గా కనిపించడం విశేషం. వీ ఆర్ కమింగ్ అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ కాన్సెప్ట్‌ పోస్టర్‌కు శంకర్‌ బాగానే ఖర్చు పెట్టించాడట. దీనికోసం శంకర్‌ ఒక కోటి 73 లక్షల రూపాయలు ఖర్చు చేయించినట్లుగా తెలుస్తుంది.

Image

ఈ పోస్టర్ తో శంకర్ తన మార్క్ ఏంటో చూపించాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కేవలం ఒక పోస్టర్ కే శంకర్ ఇంత ఖర్చు పెట్టేస్తే… సినిమా అయిపోయే వరకు బడ్జెట్ ఎంత అవుతుందో అని అభిమానులు అంచనా వేసుకుంటున్నారు. కాగా ఈ సినిమాకి దిల్ రాజు మొత్తం రూ. 250 కోట్లు కేటాయించినట్లు సమాచారం.

Also Read :