Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు

వార ఫలాలు – మేషం

Weekly Horoscope Telugu : వార ఫలాలు (06-02-2022) నుండి (12-02-2022) వరకు చేపట్టిన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి అవుతాయి. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఒక సంఘటన మీ ఆలోచనలో మార్పు తెస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సొంత వ్యూహాలు ఫలిస్తాయి. వారం చివరిలో ధనవ్యయ సూచనలు ఉన్నవి. సూర్యష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – వృషభం

వార ఫలాలు (06-02-2022) నుండి (12-02-2022) వరకు ఇంటా బయట పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తుల వివాదాలు తీరి ఆర్థిక లాభం పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సహచరులతో మరింత సఖ్యత ఏర్పడుతుంది. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. వారం మధ్యలో పనులలో వ్యయప్రయాసలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – మిథునం

వార ఫలాలు (06-02-2022) నుండి (12-02-2022) వరకు అనుకున్న పనులలో విజయవంతంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. భూ వాహన కొనుగోలు ప్రయత్నాలలో అవరోధలు తొలగుతాయి. ఉద్యోగమున నెలకొన్న సమస్యలు నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. కొన్ని వివాదాలు వాటంతట అవే తీరి ఊరట చెందుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు కలుగుతాయి. కళారంగం వారి కృషి కొంత ఫలిస్తుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. నరసింహ స్వామి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – కర్కాటకం

వార ఫలాలు (06-02-2022) నుండి (12-02-2022) వరకు చేపట్టిన పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. ఎంతటి వారినైనా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆప్తుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. మీ విలువ పెరిగి అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. స్థిరాస్తుల క్రయవిక్రయాలలో సమస్యలు తొలుగుతాయి. విద్యార్థులకు కొంత ఊరట లభిస్తుంది. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. చిన్నతరహా పరిశ్రమలకు మరింత అనుకూల పరిస్థితులు ఉన్నాయి. వారం ప్రారంభంలో సోదరులతో మాటపట్టింపులు ఉంటాయి. దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – సింహం

వార ఫలాలు (06-02-2022) నుండి (12-02-2022) వరకు వారం ప్రారంభంలో కొన్ని పనులలో అంచనాలు తప్పుతాయి. ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. క్రమక్రమంగా అనుకూల వాతావరణం నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ధార్మికసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అడ్డంకులు తొలగుతాయి. వాహనాలు, స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల మెప్పు పొందుతారు. కొన్ని రంగాల వారికి నూతన అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు కొంత బాధిస్తాయి.ఇంటా బయట చిత్రమైన సంఘటనలు జరుగుతాయి. కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – కన్య

వార ఫలాలు (06-02-2022) నుండి (12-02-2022) వరకు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రుల నుండి వచ్చే ఆహ్వానాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. స్థిరస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వివాహ శుభాకార్య విషయమై కుటుంబంలో చర్చలు జరుగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఒక సంఘటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఆస్తుల విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు గతం కంటే ముందుకు సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. రాజకీయవర్గాలకు వివాదాలు సర్దుమణుగతాయి. వారం మధ్యలో ధనవ్యయ సూచనలు ఉన్నాయి. రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – తుల

వార ఫలాలు (06-02-2022) నుండి (12-02-2022) వరకు ఇంటా బయట పరిస్థితులు కొంత వరకు అనుకులిస్తాయి. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేసి ఊరట పొందుతారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక ఋణ సమస్యలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. సంతానం విద్యా విషయాలలో కృషి ఫలిస్తుంది. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాల విస్తరణలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు తప్పవు. చిన్న తరహా పరిశ్రమలకు ఒక వార్త ఊరట ఇస్తుంది వారం చివరలో ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – వృశ్చికం

వార ఫలాలు (06-02-2022) నుండి (12-02-2022) వరకు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. పాత రుణాలు సైతం తీర్చగలుగుతారు. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది.ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయవర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్య సూచనలున్నవి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – ధనస్సు

వార ఫలాలు (06-02-2022) నుండి (12-02-2022) వరకు వారం ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా అన్నింటినీ అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చాకచక్యంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్య పరుస్తుంది.విలువైన వస్తు లాభాలు పొందుతారు ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం పొందుతారు. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేయడం వలన శుభ ఫలితాన్ని పొందుతారు.

వార ఫలాలు – మకరం

వార ఫలాలు (06-02-2022) నుండి (12-02-2022) వరకు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేయడంలో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. తెలివితేటలతో కొన్ని సమస్యలు అధిగమిస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో ఆటంకాలు తొలగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. మీ నిర్ణయాలు ఇంటా బయట అందరికి నచ్చుతాయి. గృహ నిర్మాణాల్లో కొంత పురోగతి ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. వారం మధ్యలో ప్రయాణాలు వాయిదా పడతాయి. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి విష్ణుసహస్రనామ మాత్రం పారాయణం చేయడం వల్ల సత్ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కుంభం

వార ఫలాలు (06-02-2022) నుండి (12-02-2022) వరకు ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. నూతన రుణాలు కోసం అన్వేషిస్తారు. పనులు కొంత మందగిస్తాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. శుభకార్యాలు వాయిదా పడతాయి. బంధువులతో విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ఉద్యోగాలలో కొంత అనుకూల పరిస్థితులుంటాయి. కళారంగం వారికి శ్రమ తప్ప ఫలితం ఉండదు. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – మీనం

వార ఫలాలు (06-02-2022) నుండి (12-02-2022) వరకు ఎటువంటి పనులైనా అవలీలగా పూర్తి అవుతాయి. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి కొన్ని విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. దైవ క్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. విలువైన వాహన, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణయత్నాలు ముందుకు సాగుతాయి. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వారం చివరిలో అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కాలభైరవాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Girish Purohithulu sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)