Weekly Horoscope: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది! 

Weekly Horoscope: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది! 

SREE KRUPA 

వార ఫలాలు – మేషం

వార రాశిఫలాలు (5-02-2023 to 11-02-2023)

Weekly Horoscope: చిన్నతరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో ధన పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితులనుండి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు. ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – వృషభం 

వార రాశిఫలాలు (5-02-2023 to 11-02-2023)

సంతాన విద్యా విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. అన్ని రంగాల వారికి కార్యసిద్ధి కలుగుతుంది. వారం చివరన చేపట్టిన పనులు మందగిస్తాయి. చాలాకాలంగా ఉన్న సమస్యలను క్రమక్రమంగా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. పాత బాకీలు వసూలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలను రాజీ చేసుకుంటారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. పంచముఖ హనుమత్ కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – మిథునం 

వార రాశిఫలాలు (5-02-2023 to 11-02-2023)

వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత జాప్యం తప్పదు. నిరుద్యోగులకు కష్టం ఫలించదు. అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారం చివరన ఆప్తుల నుండి శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులకు మీ అభిప్రాయాలు నచ్చవు. శివాష్టకం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – కర్కాటకం 

వార రాశిఫలాలు (5-02-2023 to 11-02-2023)

కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. అన్ని రంగాల వారు ఆశించిన ఫలితాలు పొందుతారు. వారం చివరలో చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుని బాధపడతారు. లక్ష్మి నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – సింహం 

వార రాశిఫలాలు (5-02-2023 to 11-02-2023)

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో ఆర్ధిక ఇబ్బందులుంటాయి. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కన్య 

వార రాశిఫలాలు (5-02-2023 to 11-02-2023)

ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యుల మధ్య ఆకస్మిక కలహాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. దాయాదులతో స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – తుల 

వార రాశిఫలాలు (5-02-2023 to 11-02-2023)

సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో ఆదాయ మార్గాలు తగ్గుతాయి. ఇంటా బయట నూతనోత్సాహంతో కొన్ని పనులను పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారస్తులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. నవగ్రహ కవచం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – వృశ్చికం 

వార రాశిఫలాలు (5-02-2023 to 11-02-2023)

వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. వారం ప్రారంభంలో సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయడం మంచిది. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యుల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఊహించని సంఘటనలు ఎదురైనా అదిగమించి ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగుతారు. మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – ధనస్సు 

వార రాశిఫలాలు (5-02-2023 to 11-02-2023)

భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. దీర్ఘకాలిక రుణాలు నుండి ఉపశమనం పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పట్టుదలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కనకదార స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – మకరం 

వార రాశిఫలాలు (5-02-2023 to 11-02-2023)

వృత్తి వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో బంధుమిత్రులతో పాల్గొంటారు. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. గృహమున దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – కుంభం 

వార రాశిఫలాలు (5-02-2023 to 11-02-2023)

విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి. వారం మధ్యలో ఒక సంఘటన మానసికంగా బాధిస్తుంది. వారం చివరలో శ్రమతో కానీ పనులు పూర్తికావు. ధనపరమైన ఒడిదుడుకులు చికాకు పరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

వార ఫలాలు – మీనం 

వార రాశిఫలాలు (5-02-2023 to 11-02-2023)

కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమున శుభాకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read: 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

 

Weekly Horoscope: ఆ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది!

 

For More Updates Follow us on – Sirimalli Page