Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి అవసరానికి ధన సహాయం 13-03-2022 నుండి 19-03-2022

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి అవసరానికి ధన సహాయం (13-03-2022) నుండి (19-03-2022) వరకు..

వార ఫలాలు – మేషం

Weekly Horoscope Telugu : వార ఫలాలు (13-03-2022) నుండి (19-03-2022) వరకు సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ప్రముఖ వ్యక్తులు పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో శుభాకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ప్రణాళికలతో ముందుకు సాగి లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చిన్నతరహా పరిశ్రమల వారికి అవకాశాలు మరింత మెరుగుపడతాయి. వారం చివరిలో స్వల్ప ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది. గణేశాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – వృషభం

వార ఫలాలు (13-03-2022) నుండి (19-03-2022) వరకు ఆదాయం అంతగా కనిపించదు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబసమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యమైన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. బంధువులతో స్థిరస్తి వివాదాలు నెలకొంటాయి. నిరుద్యోగుల యుత్నాలు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపారాలలో నిరుత్సాహం తప్పదు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కొన్ని రంగాల వారి అంచనాలు తప్పుతాయి. వారం మధ్యలో సన్నిహితుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విష్ణు సహస్ర నామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – మిథునం

వార ఫలాలు (13-03-2022) నుండి (19-03-2022) వరకు విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయ మార్గాలు పెరిగి పాత ఋణాలు తీరుస్తారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది. చిన్నతరహా పరిశ్రమలకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో అనుకోని ఖర్చులుంటాయి. సోదరులతో స్థిరస్తి వివాదాలు తప్పవు. దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కర్కాటకం

వార ఫలాలు (13-03-2022) నుండి (19-03-2022) వరకు నూతన వ్యక్తులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. కోర్టు వ్యవహారాలలో సానుకూల ఫలితాలుంటాయి. కొన్ని పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగ విధుల్లో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు విస్తరణకు సన్నిహితుల సహాయ సహకారలు అందుతాయి. చిన్నతరహా పరిశ్రమల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.వారం ప్రారంభంలో బంధు వర్గంతో విరోధాలు ఉంటాయి. స్వల అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – సింహం

వార ఫలాలు (13-03-2022) నుండి (19-03-2022) వరకు ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరిగి అవసరాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమౌతాయి. అన్ని రంగాల వారికి అప్రయత్నంగా నూతన అవకాశములు దక్కుతాయి. వారం చివరిలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కన్య

వార ఫలాలు (13-03-2022) నుండి (19-03-2022) వరకు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది.ఆర్థికంగాఇబ్బందులున్నప్పటికిఅవసరానికి ధన సహాయం అందుతుంది. ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి.నూతన గృహ నిర్మాణాలు చేపడతారు. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మీ సమర్థతకు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. చిన్నతరహా పరిశ్రమల అంచనాలు నిజమవుతాయి. వారం మధ్యలో ధనవ్యయ సూచనలున్నవి. కుటుంబసభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. లలిత సహస్ర నామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – తుల

వార ఫలాలు (13-03-2022) నుండి (19-03-2022) వరకు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మిత్రులతో గృహమున మరింత ఉత్సాహంగా గడుపుతారు. మంచి మాట తీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. స్థిరస్తి వివాదాల నుంచి బయటపడతారు. అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యల నుంచి చాకచక్యంగా బయటపడతారు. వ్యాపారాలలో సమస్యలు తీరి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు.అన్ని రంగాల వారికి అవకాశాలు మరింత పెరుగుతాయి. వారం ప్రారంభంలో అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. శివాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – వృశ్చికం

వార ఫలాలు (13-03-2022) నుండి (19-03-2022) వరకు ఆర్థిక లావాదేవీలు మొదట్లో ఇబ్బందిగా ఉన్నా క్రమంగా అధిగమిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చాలకాలంగా పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. సోదరులతో స్థిరస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వాహన, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిభారం కొంత వరకు తగ్గుతుంది. చిన్నతరహా పరిశ్రమలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. ఆప్తుల నుండి ఋణ నుండి ఒత్తిడి పెరుగుతుంది. రాజరాజేశ్వరి దేవి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – ధనస్సు

వార ఫలాలు (13-03-2022) నుండి (19-03-2022) వరకు కొన్ని సమస్యలను క్రమ క్రమంగా పరిష్కరించుకుంటారు. అనుకున్న పనులు కొంత నిదానించిన ఎట్టకేలకు పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకష్టం ఫలించి నూతన అవకాశములు అందుతాయి.స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.ఉద్యోగాలలో వివాదాల నుంచి బయటపడతారు. చిన్నతరహా పరిశ్రమల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ఇతరులతో అకారణ వివాదాలుంటాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి.సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – మకరం

వార ఫలాలు (13-03-2022) నుండి (19-03-2022) వరకు ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘాకాలిక ఋణ బాధలు తొలగుతాయి. అనుకున్న పనులు అనుకున్నవిధంగా పూర్తిచేస్తారు. కొన్ని వ్యవహారాలలో చాలకాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తుల విషయంలో ఒప్పందాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పరిష్కారమౌతాయి. అన్ని రంగాల వారికి నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వారం చివరిలో చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి.ఆర్థిక సమస్యలు బాధిస్తాయి. మేధో దక్షిణా మూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కుంభం

వార ఫలాలు (13-03-2022) నుండి (19-03-2022) వరకు కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల ప్రోత్సాహంతో కొన్ని పనులు ప్రారంభిస్తారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. చిన్నతరహా పరిశ్రమల వారికి నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో ధన పరమైన ఇబ్బందులుంటాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి. మధురష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – మీనం

వార ఫలాలు (13-03-2022) నుండి (19-03-2022) వరకు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. సోదరులతో విభేదాలు పరిష్కారమౌతాయి. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలుంటాయి. అన్ని రంగాల వారికి చాలకాలంగా వేదిస్తున్న పరిష్కారమవుతాయి. వారం ప్రారంభంలో ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నవగ్రహ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

Girish Purohithulu sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read :

 

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (13-03-2022)

 

Satya Nadella : ఆ ఐదు అంశాలే.. మైక్రో సాఫ్ట్ ఛైర్మన్ సత్యనాదెళ్ల జీవితాన్ని మార్చేశాయి

 

For More Updates Follow us on – Sirimalli Page