Weekly Horoscope Telugu : ఈ రాశివారికి ఆదాయానికి మించిన ఖర్చులు, నూతన ఉద్యోగావకాశాలు
Bhakthi Latest

Weekly Horoscope Telugu : ఈ రాశివారికి ఆదాయానికి మించిన ఖర్చులు, నూతన ఉద్యోగావకాశాలు

వార ఫలాలు – మేషం

Weekly Horoscope Telugu : వార ఫలాలు (07-11-2021) నుండి (13-11-2021) వరకు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి సంఘంలో పెద్దలతో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి.ఆర్ధిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరప్రాంత బంధువుల నుండి అందిన ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ పరంగా అనుకూల ఫలితాలు పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. వారం ప్రారంభమున స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు

వార ఫలాలు – వృషభం

వార ఫలాలు (07-11-2021) నుండి (13-11-2021) వరకు చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆత్మీయులతో మాట పట్టింపులు ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వాహన సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారమున చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు వారాంతమున ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సంబంధిత సమస్యలు బాధిస్తాయి. హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – మిథునం

వార ఫలాలు (07-11-2021) నుండి (13-11-2021) వరకు నూతన కార్యక్రమాలను ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు. దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయాలు లాభిస్తాయి.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సోదరులతో భూ సంబంధిత వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ప్రారంభమునకు ఆటంకాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం మధ్యలో బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. ఋణ ఒత్తిడి పెరుగుతుంది నవగ్రహారాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కర్కాటకం

వార ఫలాలు (07-11-2021) నుండి (13-11-2021) వరకు ఇంట బయట ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో పెద్దల నుండి ఆసక్తికర విషయాలు సేకరిస్తారు. దూరప్రాంత బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.నూతన గృహ నిర్మాణ ప్రారంభమునకు ధనసహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు పొందుతారు నిరుద్యోగులకు అధికారుల సహాయంతో నూతన అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో ప్రయాణమున మార్గ అవరోధాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – సింహం

వార ఫలాలు (07-11-2021) నుండి (13-11-2021) వరకు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహమునకు ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. పాత మిత్రులతో చిన్ననాటి విషయాల గురించి చర్చిస్తారు. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభమునకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన లాభాలు అందుతాయి. వారాంతమున సోదరులతో అనుకోని విభేదాలుతలెత్తుతాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కన్య

వార ఫలాలు (07-11-2021) నుండి (13-11-2021) వరకు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది.తెలివితేటలతో దీర్ఘకాలిక సమస్యలు రాజీ చేసుకుంటారు. మొండి బకాయిలు వసూలవుతాయి. గృహ నిర్మాణానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారములు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగి ఆర్ధిక లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.సోదరులతో భూ సంబంధిత వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారపరంగా నూతన ప్రణాళికలను అమలు చేసి పుంజుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వారం చివరన ధనవ్యయ సూచనలు ఉన్నవి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో మీ మాటతో విభేదిస్తారు. సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – తుల

వార ఫలాలు (07-11-2021) నుండి (13-11-2021) వరకుఅవసరానికి చేతిలో ధనం నిల్వ లేక ఇబ్బంది పడతారు. చేపట్టిన వ్యవహారాలలో లోటుపాట్లు సరిద్దిదుకుంటారు. నిరుద్యోగులకు అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో పెద్దల సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చిన్నతరహా పరిశ్రమలకు స్వల్ప లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిసారిస్తారు. సోదరులతో కొన్ని వ్యవహారాలలో వివాదాలకు దిగడం మంచిది కాదు. వారాంతమున ఆర్ధిక ఇబ్బందులుంటాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి దేవి ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – వృశ్చికం

వార ఫలాలు (07-11-2021) నుండి (13-11-2021) వరకు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన వ్యాపారస్తుల ఆశించిన లాభాలు అందుతాయి. సంతాన విద్యా ఫలితాలు ఆనందం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఆప్తుల నుండి అవసరానికి ధనసహాయం అందుతుంది. వారాంతమున కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి. శివాలయంలో అభిషేకం చేయించటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

వార ఫలాలు – ధనస్సు

వార ఫలాలు (07-11-2021) నుండి (13-11-2021) వరకు సంఘంలో పెద్దల సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి మీ సమర్థతను చాటుకుంటారు కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. బంధువర్గంతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు లాభాలు కలిగిస్తాయి. ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.ఆదాయ మార్గాలు గతం కంటే మెరుగవుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. గణేశాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – మకరం

వార ఫలాలు (07-11-2021) నుండి (13-11-2021) వరకు దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా బయటపడతారు చేపట్టిన పనులలో ఒత్తిడిని అధిగమించి నిదానంగా పూర్తిచేస్తారు.ఆర్థిక వ్యవహారాలలో మెరుగైనవాతావరణం ఉంటుంది.రియల్ఎస్టేట్ వ్యాపారులకు నూతన లాభాలు అందుతాయి.చిన్ననాటి మిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేసి అధికారుల మన్ననలు పొందుతారు. వారం ప్రారంభంలో ధన పరంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి లక్ష్మీసహస్రనామస్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు

వార ఫలాలు – కుంభం

వార ఫలాలు (07-11-2021) నుండి (13-11-2021) వరకు చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి.దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. మిత్రులతో వ్యాపార పరమైన విషయాల గురించి చర్చిస్తారు దాయాదులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థుల విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగమున అనుకూల స్థాన చలన సూచనలు ఉన్నవి. గృహమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వారం మధ్యన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నరసింహ స్వామి స్తోత్రం పారాయణం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – మీనం

వార ఫలాలు (07-11-2021) నుండి (13-11-2021) వరకు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.భూ సంబంధిత క్రయవిక్రయాలలో అనుకూలత కలుగుతుంది సోదరులతో సఖ్యత గా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో స్థిరాస్తి వ్యవహారాలను సజావుగా పూర్తిచేస్తారు. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతమౌతాయి. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారపరంగా నూతన పద్ధతులను అవలంభించి సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు పని భారం నుండి కొంత ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి వారాంతమున పనులందు వ్యయ ప్రయాసలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

 

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.comGIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read :

International Yoga Day : మీరు ఊపిరి తీసుకునే విధానాన్ని బట్టి.. మీ ఆయుష్షును చెప్పే యోగ.. అదెలా అంటే..

For More Updates Follow us on – Sirimalli Page