2024-07-27 09:09:35
Samantha Preetham Jukalker : సమంతకు ప్రీతమ్ జుకల్కర్ కు ఎలా పరిచయం.. అసలు ఎవరీయన? – Sirimalli.com

Samantha Preetham Jukalker : సమంతకు ప్రీతమ్ జుకల్కర్ కు ఎలా పరిచయం.. అసలు ఎవరీయన?

Samantha Preetham Jukalker : ప్రీతమ్ జుకల్కర్. సమంత నాగచైతన్యల విడాకులు విషయంలో ఇప్పుడిదే హాట్ నేమ్. ఎవరీ ప్రీతమ్ జుకల్కర్ అంటూ తెగ సెర్చ్ చేస్తు్న్నారు. కొన్నాళ్లుగా సమంత పక్కన కనిపిస్తున్నాడు సరే.. అసలు ఆయనకు సమంతకు ఎక్కడ ఎలా పరిచయం అయ్యింది అన్నదాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పేరు భారీగా ఉంది కదా అని ఎక్కడివాడో అనుకోనక్కరలేదు.

హైదరాబాద్ లో కాస్త పేరున్న డిజైనర్లలో ప్రీతమ్ జుకల్కర్ ఒకరు. కాటన్ వస్త్రాలకు సంబంధించి ఫ్యాషన్ గార్మెంట్స్ ను తయారుచేయడంలో కాస్త చేయితిరిగినోడే. సమంతకు అలాగే పరిచయం అయ్యాడు. సినిమా హీరోయిన్ గా ఎక్కడకెళ్లినా కాస్త ఫ్యాషన్ గా కనిపించే సమంతకు చాలా డిజైన్స్ తయారుచేసి ఇచ్చాడు. ఆయన తయారుచేసిన డిజైన్స్ కు ఆమధ్య మంచి పేరే వచ్చింది.

ప్రీతమ్ జుకల్కర్ వయసు కూడా పెద్దగా ఏమీ లేదు. దాదాపు 33 ఏళ్లుంటాయి. అంటే నవ యువకుడే. అసలే కుర్రాడు.. ఆపై ఫ్యాషన్ డిజైనర్.. అందుకే సెలబ్రెటీల విషయంలో బాగా పాపులర్ అయ్యాడు. ‘ది ట్రూ కాస్ట్’ అనే డాక్యుమెంటరీ చూశాకే ఆయనకు అసలు విషయం అర్థమైంది. ఆ తరువాతే ఈ ఫ్యాషన్ డిజైనింగ్ లోకి వచ్చాడు. తరువాత దానికో థీమ్ ను సెట్ చేసుకున్నాడు.

భారతీయ వస్త్ర సంప్రదాయాన్ని తెరపైకి తేవాలని.. దానిని బతికించాలని ప్రీతమ్ జుకల్కర్ కు బాగా కోరికగా ఉండేది. ఆయన దృష్టిలో ఫ్యాషన్ అంటే సంస్కృతి సంప్రదాయాల వారధిగా ఉండాలి. అందుకే దానికి తగ్గట్టుగానే డిజైన్స్ చేయడం ప్రారంభించాడు. అదిగో.. అక్కడ స్టార్ట్ అయ్యింది సెలబ్రెటీలతో పరిచయం. అప్పుడే సమంతను కూడా కలిశాడు.

అసలీ ఫ్యాషన్ డిజైనింగ్ లోకి రావడానికి మూలకారణమేంటయ్యా అంటే.. ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పాలి. చిన్నప్పుడు ప్రీతమ్ వాళ్మ అమ్మగారు మిషన్ పైన బట్టలు కుట్టేవారు. అలా దానిపై ఇంట్రస్ట్ పెరిగింది. వాళ్లమ్మగారు మిషన్ పైనుంచి లేచి.. కాస్త పక్కకు వెళ్లగానే.. ఆ సామ్రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకునేవాడు. అలా దానిపై ఆసక్తి పెరిగింది.

ప్రీతమ్ జుకల్కర్ ఫ్యాషన్ మ్యాగ్ జైన్ లు చదవడం మొదలుపెట్టాడు. తరువాత ఫ్యాషన్ షోలలో సెలబ్రెటీల మాటలు వినేవాడు. అలా ఫ్యాషన్ అండ్ టెక్స్ టైల్స్ లో డిగ్రీ చేశాడు. కాలేజ్ యూత్ పై కాన్సన్ ట్రేషన్ చేశాడు. టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన తరువాత కొంతమంది హీరోయిన్లు పరిచయమయ్యారు. సమంతతో పరిచయం అవ్వడం, అది క్లోజ్ గా మారడం చకచకా జరిగిపోయాయి.

ప్రీతమ్ జుకల్కర్ కు పరిచయమైన హీరోయిన్స్ లో సమంత టాప్ లో ఉంటుంది. తరువాత రకుల్ ప్రీత్ సింగ్, రాశిఖన్నా కూడా పరిచయమయ్యారు. ఇప్పుడు సమంత విడాకుల తరువాత ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టులు.. ప్రీతమ్ జుకల్కర్ మెడకే చుట్టుకున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని డిలీట్ చేయాల్సి వచ్చింది.

Also Read : 

For More Updates Follow us on – Sirimalli Page