2024-07-27 05:11:43
Keerthi Reddy : నటి కీర్తిరెడ్డి ఇంట విషాదం.. ఆమె తండ్రి కన్నుమూత – Sirimalli.com

Keerthi Reddy : నటి కీర్తిరెడ్డి ఇంట విషాదం.. ఆమె తండ్రి కన్నుమూత

Keerthi Reddy : సినిమా ఇండస్ట్రీలోను, వారి ఆత్మీయవర్గాల్లోను ఒక్కొక్కరి మరణం అందరినీ కలచివేస్తోంది. సెలబ్రెటీలు మరణిస్తే.. అది వారి కుటుంబంతో పాటు.. వారితో అనుబంధం ఉన్నవారికి అంతులేని శోకాన్ని మిగులుస్తుంది. కరోనా కావచ్చు.. అనారోగ్యం వల్ల కావచ్చు.. కానీ వారి మృతి మాత్రం అందరికీ తీరని లోటే. ఇప్పుడు అలాంటి ఘటనే తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డి (Keerthi Reddy) ఇంట చోటుచేసుకుంది.

తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి
  తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి

కీర్తిరెడ్డి తండ్రి, టీఆర్ఎస్ నేత కేశ్ పల్లి ఆనందరెడ్డి శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినా.. ఆయనను బతికించడానికి డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కీర్తిరెడ్డి ఇంట అంతులేని విషాదాన్ని నింపింది.

 

 హీరోయిన్ కీర్తి రెడ్డి
     హీరోయిన్ కీర్తి రెడ్డి

నిజామాబాద్ మాజీ ఎంపీ కేశ్ పల్లి గంగారెడ్డి తనయుడే ఆనందరెడ్డి. తొలుత యూత్ లీడర్ గా చేశారు. బీజేపీ తరపున 2014లో నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓటమి తప్పలేదు. 2018లో టీఆర్ఎస్ లో చేరారు.

పవన్ హీరోయిన్ కీర్తి రెడ్డి
            పవన్ హీరోయిన్ కీర్తి రెడ్డి

ఆనందరెడ్డికి ఇద్దరు కుమార్తెలు. వారిలో ఒకరు కీర్తిరెడ్డి. తొలిప్రేమ సినిమా విడుదలైన సమయంలో నాటి కుర్రకారు కలల రాణి ఎవరంటే కచ్చితంగా కీర్తిరెడ్డి పేరే చెబుతారు. అంతలా ఆనాటి యూత్ హృదయాలను కొల్లగొట్టిన కథానాయిక. ఆ సినిమాలో ఆమె యాక్షన్ కు అందరూ అంతలా ఫిదా అయ్యారు.

నటి కీర్తి రెడ్డి
  నటి కీర్తి రెడ్డి

కీర్తిరెడ్డి ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా అంతగా క్లిక్కవ్వలేదు. తరువాత 2004లో అక్కినేని మనవడు.. హీరో సుమంత్ ను వివాహం చేసుకుంది. కానీ తరువాత 2006లో ఈ జంట విడాకులు తీసుకుంది. ఆ తరువాత ఆమె డాక్టర్ కార్తీక్ ను పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులో సెటిల్ అయ్యారు.

కీర్తి రెడ్డి
        కీర్తి రెడ్డి

గన్ షాట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తిరెడ్డి.. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించారు. ఎనిమిదేళ్ల వయసులోనే భరతనాట్యంలో ట్రైనింగ్ తీసుకున్నారు. 2004లో గుణశేఖర్ డైరెక్షన్ లో మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాలో నటించారు. అందులో సూపర్ స్టార్ కు అక్కగా యాక్ట్ చేశారు. ఆ సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలీంఫేర్ పురస్కారాన్నీ అందుకున్నారు.

ఇవి కూడా చదవండి : 

Also Read : Rashmika Mandanna : వాళ్ల ఇంటి కోడలినే అవుతానంటున్న రష్మిక! 

Also Read :  అందాలకు యువరాణి.. ఈ శివాని.. తమిళ స్మాల్ స్క్రీన్ లో బిగ్ బ్యూటీ

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage