Today Horoscope : 16-05-2021ఆది వారం నేటి రాశిఫలాలు….

Today Horoscope : 16-05-2021 ఆది వారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశుల(Today Horoscope)ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (16-05-2021) రాశి ఫలితాలు

మేషం :

ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు నూతనఅవకాశాలు లభిస్తాయి.

వృషభం :

దూరప్రయాణ సూచనలు ఉన్నవి.ఇంటా బయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలను వాయిదా వేయటం మంచిది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా వాతావరణం అంతంతమాత్రంగానే ఉంటుంది. ఉద్యోగమున ఇతరులతో మాట పడవలసి వస్తుంది నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి.

మిధునం :

దూరప్రాంత ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.

కర్కాటకం

ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు.సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. బంధు మిత్రులతో ఏర్పడిన వివాదాల పరిష్కారానికి ఆటంకాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వాహన ప్రయాణాలలో నిర్లక్ష్యం పనికిరాదు. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి అధికం అవుతుంది.

సింహం

సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తిగా ఉంటుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

కన్య :

ఉద్యోగస్తులకుఅధికారుల ఆదరణ పెరుగుతుంది.రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహనిర్మాణప్రయత్నాలు వేగవంతంచేస్తారు. అనారోగ్య సమస్యలనుంచి బయటపడతారు చేపట్టిన వ్యవహారాలు అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధనం అందుతుంది.

తుల :

దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక వృద్ధి కలుగుతుంది. కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో ప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం

కుటుంబసభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉండదు. నిరుద్యోగులకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవ కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది.

ధనస్సు :

చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు కుదురుతాయి కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని పనులలో జీవిత భాగస్వామి సలహాలు కలిసివస్తాయి.

మకరం :

కీలక వ్యవహారాలలో విజయం సాదిస్తారు.చేపట్టిన పనులుఅప్రయత్నంగా పూర్తవుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంటారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో అవకాశాలు అందిపుచ్చుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

కుంభం :

చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. వృధా ఖర్చులను అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఇతరలతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.సంతాన విద్యా విషయాలు పై దృష్టి సారిస్తారు.

మీనం :

వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Keerthi Reddy : నటి కీర్తిరెడ్డి ఇంట విషాదం.. ఆమె తండ్రి కన్నుమూత

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Aiso Read : Today Panchangam : 16-05-2021 ఆది వారం .. నేటి పంచాంగం

Also Read : Anasuya Bharadwaj : బాధ ఎక్కువైతే వైన్ తాగుతా.. మా ఆయనతో చెప్పుకుంటా – అనసూయ

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage