2024-07-27 05:50:53
Today Horoscope: ఆ రాశి వారికి బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు (30-11-2023) – Sirimalli.com

Today Horoscope: ఆ రాశి వారికి బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు (30-11-2023)

Today Horoscope: ఆ రాశి వారికి బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు (30-11-2023)

SREE KRUPA (30-11-2023) రాశి ఫలితాలు

మేషం: వ్యాపార విషయంలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటాబయటా మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి.

వృషభం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపార విస్తరణకుపెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. పాతరుణాలు తీర్చాగలరు.

మిధునం: ఇంటాబయటా నూతన సమస్యలు తప్పవు. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు.

కర్కాటకం: వృత్తి ఉద్యోగాల్లో మీ హోదా పెరుగుతుంది. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. విద్యార్థుల నూతన విద్యావకాశములు లభిస్తాయి.

సింహం: బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పనిఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వాతావరణం ఆశించిన విధంగా ఉంటుంది.

కన్య: చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

Also Read:  Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును!

తుల: ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆకారణ వివాదాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

వృశ్చికం: నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

ధనస్సు: గృహ నిర్మాణ ఆలోచనలో ఆచరణలో పెడతారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

మకరం: బంధు వర్గంతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. దైవ చింతన పెరుగుతుంది.

కుంభం: చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలుచేస్తారు. మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు.

మీనం: సమాజంలో పేరుకలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

Today Horoscope
SREE KRUPA

Also Read: