Bhakthi

A Glimpse into Nagula Chavithi: నాగుల చవితి రోజున పుట్టకు ఎందుకు పూజలు చేస్తారు? నాగుపామును పూజించే సంప్రదాయం ఎప్పటి నుంచి ఉంది?

Nagula Chavithi festival

Nagula Chavithi festival

A Glimpse into Nagula Chavithi: నాగుల చవితి రోజున పుట్టకు ఎందుకు పూజలు చేస్తారు? నాగుపామును పూజించే సంప్రదాయం ఎప్పటి నుంచి ఉంది?

A Glimpse into Nagula Chavithi:

నాగుల చవితి రోజు పుట్టను పూజిస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నాగులు భూమిలోని ఓషధులను కాపాడేవారని, మంచి భర్తలుగా, భార్యలకు సపర్యలు చేసేవారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి, నాగులను పూజిస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత, సౌభాగ్యం పెరుగుతాయని నమ్ముతారు.

దీపావళి తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి (Nagula Chavithi) పండుగ చేసుకుంటారు. ఈ ఏడాది నవంబరు 17 శుక్రవారం నాడు నాగుల చవితి వచ్చింది. కొంతమంది శ్రావణ శుద్ధ చతుర్థినాడు కూడా జరుపుతారు.

నాగుల చవితి పండుగ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో వైభవంగా జరుపుతారు. . ఈ రోజున నాగులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పాముల పుట్టలకు పాలు, పండ్లు, పువ్వులు సమర్పిస్తారు. నాగుల చవితి రోజు పాములను చంపడం అత్యంత పాపమని శాస్త్రాలు చెబుతున్నాయి.

Also Read:  Sri Rama Navami : శ్రీరాముడు పుట్టిన పర్వదినాన.. సీతారాముల కల్యాణానికి ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా?

 

మానవుడి మనుగడ ప్రారంభమైనప్పటి నుంచి ప్రకృతితో మమేకమై జీవించాడు. భారతీయ సంప్రదాయం ప్రకారం ప్రకృతి లోని చెట్టు, పుట్ట, రాయి, రప్ప, కొండ, నది, పర్వతం ఇలా తన జీవనానికి ఉపయోగపడే సమస్త ప్రాణకోటిని పూజిస్తూ వస్తున్నాడు.

భారతీయ సంస్కృతిలో ‘నాగుపాము’ను పూజించే సంప్రదాయం ఉంది. సర్పాలకు అధిపతి అయిన నాగరాజును నాగదేవతగా పూజిస్తారు. నాగులు భూమిలోని సర్వజీవులకు రక్షణ కల్పిస్తాయని నమ్ముతారు. నాగులకు పూజలు చేస్తే మంచి ఆరోగ్యం, సుఖసంతోషాలు లభిస్తాయని విశ్వసిస్తారు.

నాగుల చవితి (Nagula Chavithi) రోజు నాగులను పూజిస్తే కుజ దోషం, కాలసర్ప దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కుజుడు భార్యాభర్తల సంబంధాలకు అధిపతిగా నమ్ముతారు. కుజుడిలో దోషం ఉంటే భార్యాభర్తల మధ్య విభేదాలు, ఇబ్బందులు వస్తాయి. నాగులను పూజిస్తే కుజ దోషం తొలగిపోయి, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది.

నాగుల చవితి (Nagula Chavithi) రోజు నాగులను పూజించడం వల్ల మంచి ఫలితాలు, శుభాలు కలుగుతాయని నమ్ముతారు.

Also Read: