Today Horoscope: ఆ రాశి వారు ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. (23-11-2023)

Today Horoscope: ఆ రాశి వారు ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. (23-11-2023)

 

SREE KRUPA (23-11-2023) రాశి ఫలితాలు

మేషం: చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. వృధా ఖర్చులు పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం: సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు . మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇతరులకు సహాయం అందిస్తారు.

మిధునం: చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు ఇబ్బంది కలిగిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం: చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

సింహం: ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యం. సోదరులతో కలహా సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులుంటాయి.

కన్య: నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటా. స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

Also Read: Warm Water : గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

తుల: సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగమున అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

వృశ్చికం: వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది తప్పదు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి.

ధనస్సు: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. దూర బంధువులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మకరం: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

కుంభం: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయాలి. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి.

మీనం: చేపట్టిన పనులను మరింత ఉత్సాహంగా పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

Today Horoscope
SREE KRUPA

Also Read: