2024-07-27 09:05:14
Today Horoscope: ఆ రాశి వారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. (20-11-2023) – Sirimalli.com

Today Horoscope: ఆ రాశి వారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. (20-11-2023)

Today Horoscope: ఆ రాశి వారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. (20-11-2023)

SREE KRUPA (20-11-2023) రాశి ఫలితాలు

మేషం

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

—————————————

వృషభం

స్థిరస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం కలుగుతుంది.

—————————————

మిధునం

చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

—————————————

కర్కాటకం

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం ఉండదు. సోదరులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

—————————————

సింహం

సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఇంటాబయటా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

—————————————

కన్య

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయట పడగలుగుతారు. దూరపు బంధువులను కలుసుకుని వివాహ విషయమై చర్చ చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

—————————————

తుల

ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

—————————————

వృశ్చికం

శ్రమతో కూడిన దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.

—————————————

ధనస్సు

బంధు మిత్రులతో గృహమున మరింత ఉత్సాహంగా గడుపుతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగమున మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

—————————————

మకరం

వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి.

—————————————

కుంభం

ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. వృత్తివ్యాపారాలు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. సంతానం విద్యా విషయాల సంతృప్తినిస్తాయి.

—————————————

మీనం

కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.


Today Horoscope
SREE KRUPA

Also Read: