2024-07-27 05:33:33
Today Horoscope: ఆ రాశి వారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. (03-12-2023) – Sirimalli.com

Today Horoscope: ఆ రాశి వారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. (03-12-2023)

Today Horoscope: ఆ రాశి వారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. (03-12-2023)

SREE KRUPA (03-12-2023) రాశి ఫలితాలు

మేషం: దూర ప్రాంతాల సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ఇంటాబయట మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

వృషభం: మిత్రుల సహాయంతో కొన్ని ప నులు పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రుణ ఒత్తిడి నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. నిరుద్యోగులకు అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేయనుకోవాలి.

మిధునం: కుటుంబ సభ్యులతో విబేధాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులను కొంత మందకోడీగా సాగుతాయి. అన్నిరంగాల వారికి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

కర్కాటకం: వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. భూ క్రయవిక్రయాలలో లాభాలు అందుతాయి. అధికారులు అనుగ్రహంతో ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

సింహం: చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితులు నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. ఇంటా బయట సమస్యల నుంచి బయటపడతారు.

కన్య: సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలం లో పూర్తి అవుతాయి. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు.

          Also Read:  Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును!

తుల: పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

వృశ్చికం: సంతాన విద్య విషయాలపై దృష్టి సారించడం మంచిది. దైవ అనుగ్రహం తో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంఘం లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడతారు.

ధనస్సు: వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ఆందోళనలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అకారణ వివాదాలు కలుగుతాయి.

మకరం: మిత్రులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయమై అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

కుంభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం గా ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య విషయం లో శ్రధ్ధ వహించాలి. అన్ని రంగాల వారికి అనువైన కాలం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో వివాదాలు తొలగుతాయి.

మీనం: ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషం గా గడుపుతారు. నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహంలో శుభకార్యాల గూర్చి చర్చ జరుగుతుంది.

Today Horoscope
SREE KRUPA

Also Read: