2024-07-27 10:30:01
Today Horoscope : ఆ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు ( 31-03-2022 ) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు ( 31-03-2022 )

Today Horoscope : ఆ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు ( 31-03-2022 )

 

SREE KRUPA (31-03-2022) రాశి ఫలితాలు

 

మేషం – 31-03-2022

Today Horoscope : చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి.

వృషభం – 31-03-2022

ముఖ్యమైన పనులలో అవరోధాలు కలుగుతాయి. మిత్రులతో కలహా సూచనలున్నవి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన శిరోబాధ కలిగిస్తాయి. వ్యాపారాలలో శ్రమధిక్యత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు.

మిధునం -31-03-2022

సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి చిన్ననాటి మిత్రులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా ఇబ్బందులు అధిగమించి లాభాలు అందుకుంటారు.

కర్కాటకం – 31-03-2022

నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురు చూస్తున్న అవకాశములు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

సింహం – 31-03-2022

చేపట్టిన పనులందు కార్యాటాంకములు తప్పవు.ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఇంటాబయట సమస్యలు చికాకు పరుస్తాయి. దైవ సంబంధిత కార్యక్రమాలలో ఆసక్తిగా పాల్గొంటారు. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు స్థానచలనాలుంటాయి.

కన్య – 31-03-2022

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి సంతాన విద్యా విషయాలలో కొంత శ్రద్ద వహించాలి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.

తుల – 31-03-2022

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు రాజకీయ సభ సమావేశములకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన శుభకార్య విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

వృశ్చికం – 31-03-2022

మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుతో కొత్త పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

ధనస్సు – 31-03-2022

అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దూరప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. పుణ్య క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి.

మకరం – 31-03-2022

చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి బంధు మిత్రులతో కీలక వ్యవహారాలు చర్చిస్తారు ధన సంభంధిత వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం వలన ఆర్ధిక నష్టాలు తప్పవు. నిరుద్యోగ యత్నాలు మందగిస్తాయి.

కుంభం – 31-03-2022

చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

మీనం – 31-03-2022

గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులందు శ్రమ అధికమౌతుంది. ఇతరులతో అకారణంగా విబేదిస్తారు దాయాదులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

Girish (Purohithulu) sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

For More Updates Follow us on – Sirimalli Page