2024-07-27 05:02:19
Horoscope in Telugu : ఈ రాశి వారికి నూతన వ్యాపారాల్లో లాభం.. వివిధ రాశుల ఫలితాలు – Sirimalli.com

Horoscope in Telugu : ఈ రాశి వారికి నూతన వ్యాపారాల్లో లాభం.. వివిధ రాశుల ఫలితాలు

Horoscope in Telugu : ఈ రాశి వారికి నూతన వ్యాపారాల్లో లాభం.. వివిధ రాశుల ఫలితాలు

SREE KRUPA (30-09-2021) రాశి ఫలితాలు

మేషం – 30-09-2021

బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారులకు చిక్కులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం – 30-09-2021

చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆస్తి వివాదాల లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.వ్యాపారమును ఆశించిన లాభాలు అందుకుంటారు విద్యార్థులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో కీలక సమాచారం అందుతుంది.

మిధునం – 30-09-2021

గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

కర్కాటకం – 30-09-2021

అవసరానికి సన్నిహితులు సాయం పొందుతారు. స్థిరాస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది, గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు దీర్ఘ కాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

సింహం – 30-09-2021

నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి ఆరోగ్య పరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి వ్యాపారులకు గందరగోళ పరిస్థితులుంటాయి ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

కన్య – 30-09-2021

ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకున్నది సాధిస్తారు. దైవచింతన పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

తుల – 30-09-2021

సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి, స్థిరస్తి కొనుగోలు చేస్తారు. ఆలయ దర్శనం చేసుకుంటారు. ఉద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశములు లభిస్తాయి.

వృశ్చికం – 30-09-2021

బంధు మిత్రులతో మీ మాటతో విబేదిస్తారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి, కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి.ఉద్యోగం వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక వాతావరణం చికాకుగా ఉంటుంది.

ధనస్సు – 30-09-2021

సోదరులతో స్థిరస్తి వివాదాలు కలుగుతాయి అవరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం – 30-09-2021

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారలకు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం యోగం ఉన్నది.

కుంభం – 30-09-2021

ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల ఊహలు నిజమవుతాయి. మిత్రుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. భూ వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారములు ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగులకు ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది.

మీనం – 30-09-2021

ప్రయాణాల్లో ఆకస్మిక మారులుంటాయి. ధన వ్యయ సూచనలున్నవి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి అనారోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులుంటాయి వ్యాపారులకు నిరుత్సాహవాతావరణం ఉంటుంది. ఉద్యోగమున పరిస్థితులు అనుకుంలించవు.

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.comGIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

Also Read :

For More Updates Follow us on – Sirimalli Page