2024-07-27 04:41:46
Sridevi Drama Company : గుండెను టచ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో.. దీనిని చూస్తే కన్నీళ్లు ఆగవు! – Sirimalli.com

Sridevi Drama Company : గుండెను టచ్ చేసిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో.. దీనిని చూస్తే కన్నీళ్లు ఆగవు!

Sridevi Drama Company : అమ్మ లేని లోటు ఎవరూ తీర్చలేరు.. నాన్న లేని లోటు ఎప్పటికీ పూడ్చలేరు. తల్లిదండ్రులంటే వరం. దేవుడు ఉండడానికి వీలుపడని చోట వీళ్లను పంపిస్తాడు. అలాంటిది కొంతమందికి ఏం మాయరోగం వస్తుందో కాని.. కన్నవారిని.. వృద్దాశ్రమాల్లో చేర్పించేస్తారు. వాళ్లేమైనా బొమ్మలా.. ఆడుకోవడానికి పనికిరావని స్టోర్ రూమ్ లో పడేయడానికి. అందుకే అలాంటి పండుటాకుల గుండెలోతులను టచ్ చేసింది శ్రీదేవీ డ్రామా కంపెనీ (Sridevi Drama Company).

శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో అంటే చాలా నవ్విస్తుంది… పొట్టచెక్కలయ్యేలా చేస్తుందని ఈ వారం కూడా చాలామంది ఎదురుచూసుంటారు. కానీ ఈసారి ఈ ప్రోమో ఏడిపించేసింది.. ఇంకా చెప్పాలంటే.. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పించే కొడుకులు, కూతుళ్ల చెంప ఛెళ్లున కొట్టేటట్లు.. ప్రోమో ఉంది. తల్లిదండ్రులంటే దేవతలు. వాళ్లను వదిలి ఉండడానికి మనసెలా ఒప్పుతుందో కాని అలాంటి మహానుభావులకు శతకోటి వందనాలు.

ఈ ప్రోమోలో సుడిగాలి సుధీర్ నిజంగానే కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు అందరి కళ్లు చెమరుస్తాయి. యాంకర్లు, యాక్టర్లు.. ఒకరేంటి ఎవరికి తోచింది వారు తమ వంతు సాయంగా ఈ వృద్ధాశ్రమానికి విరాళంగా ఇచ్చారు. దాంతో ఆ ఓల్డేజ్ హోమ్ నడిచిపోతుందని కాదు.. కానీ కొన్ని రోజులైనా వాళ్ల కడుపు నిండుతుందిగా.. కొన్ని రోజులైనా వాళ్లు మందులు వేసుకోవడానికి ఉపయోగపడుతుందిగా. నిజంగా వాళ్లిచ్చిన కరెన్సీ నోట్లకు నిజమైన విలువ దక్కింది మాత్రం ఇప్పుడే.

ఇంద్రజ అంటే అందంగా ఉంటుందని.. చిన్నారిలా నవ్వుతుందని మాత్రమే అనుకుంటారు. కానీ ఆమె మనసు తెలిసినవారికి అంతకంటే అందమైనది ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదనిపిస్తుంది. చిన్నారిలా నవ్వడమే కాదు.. పెద్దమనసు చేసుకుని పదిమందికీ సాయపడడం కూడా తెలుసని ఈ ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఈ వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధుల మెడిసిన్ ఖర్చులకు నెలకు లక్ష నుంచి లక్షన్నర వరకు ఖర్చవుతుంది. ఆ విషయం అడిగి మరీ తెలుసుకుని.. ఇకపై ప్రతీ నెలా తాను ఆ ఖర్చు భరిస్తానని.. ఆశ్రమం అకౌంట్ నెంబర్ కు ప్రతీ నెలా తన తరుపున డబ్బు జమవుతుందని చెప్పారు. నిజంగా హ్యాట్సాఫ్ ఇంద్రజ!

మొత్తానికి శ్రీదేవీ డ్రామా కంపెనీకి ఈసారి మాత్రం సలామ్ కొట్టాల్సిందే. టచ్ చేశావు ‘శ్రీదేవి’… టచ్ లో ఉంటాం.

 

Also Read :

For More Updates Follow us on – Sirimalli Page