2024-07-27 06:04:10
Today Horoscope : ఆ రాశి వారు నూతన వస్తు, వాహనాలు కొనుగోలుకు ఛాన్స్! (30-07-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారు నూతన వస్తు, వాహనాలు కొనుగోలుకు ఛాన్స్! (30-07-2022)

Today Horoscope : ఆ రాశి వారు నూతన వస్తు, వాహనాలు కొనుగోలుకు ఛాన్స్! (30-07-2022)

SREE KRUPA (30-07-2022) రాశి ఫలితాలు

 

మేషం – 30-07-2022

Today Horoscope : తల్లి తరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

వృషభం – 30-07-2022

వాహన యోగం ఉన్నది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

మిధునం – 30-07-2022

ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కొన్ని విషయాలలో మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. నూతన రుణయత్నాలు చెయ్యకపోవడం మంచిది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి.

కర్కాటకం – 30-07-2022

ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. కుటుంబ విషయంలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులు నూతన అవకాశములు అందుతాయి.

సింహం – 30-07-2022

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభించదు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబమున కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి.

కన్య – 30-07-2022

వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరమైన చిక్కులు నుండి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన విజయం సాధిస్తారు.

తుల – 30-07-2022

చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

వృశ్చికం – 30-07-2022

సంతాన విద్యా విషయాలకు సంభందించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సౌకర్యాలు పెరుగుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు.

ధనస్సు – 30-07-2022

బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం వృధాగా మిగులుతుంది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి.

మకరం – 30-07-2022

ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.

కుంభం – 30-07-2022

సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. దైవ చింతన పెరుగుతుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

మీనం – 30-07-2022

ఆర్ధిక విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. సహోద్యోగుల ప్రవర్తన వలన శిరో బాధలు పెరుగుతాయి. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.


Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారు ఈ వారమంతా ఫుల్ హ్యాపీ! (24-07-2022 నుంచి 30-07-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page