2024-07-27 14:51:49
Today Horoscope: ఆ రాశి వారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు! (29-5-2023) – Sirimalli.com

Today Horoscope: ఆ రాశి వారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు! (29-5-2023)

Today Horoscope: ఆ రాశి వారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు! (29-5-2023)

SREE KRUPA (29-5-2023) రాశి ఫలితాలు

మేషం – 29-5-2023

Today Horoscope: బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమపెరుగుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది.

వృషభం – 29-5-2023

ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు. ఉద్యోగులకు నూతన బాధ్యతల వలన శిరోభాధలు అధికమౌతాయి. సంతాన విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది.

మిధునం – 29-5-2023

వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దూరప్రయాణాలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు. ఉద్యోగస్తులు అదనపు పనిఒత్తిడి నుండి బయటపడతారు.

కర్కాటకం – 29-5-2023

ఒక వ్యవహారంలో బంధువులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం మందకొడిగా సాగుతుంది. దూరప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

సింహం – 29-5-2023

సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

కన్య – 29-5-2023

చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

తుల – 29-5-2023

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. వ్యాపారపరంగా నూతన లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి.

వృశ్చికం – 29-5-2023

బంధు మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది ధన వ్యవహారాలు కలిసివస్తాయి.

ధనస్సు – 29-5-2023

చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు మానసికంగా భాదిస్తాయి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు వలన నష్టాలను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు కలసిరావు.

మకరం – 29-5-2023

ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది.

కుంభం – 29-5-2023

విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

మీనం – 29-5-2023

సోదరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read:

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

Weekly Horoscope: ఆ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది!

For More Updates Follow us on – Sirimalli Page