2024-07-27 06:07:28
Today Horoscope : ఆ రాశివారికి ఆర్థిక పరిస్థితిలో ఆకస్మిక మార్పులు (29-04-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశివారికి ఆర్థిక పరిస్థితిలో ఆకస్మిక మార్పులు (29-04-2022)

Today Horoscope : ఆ రాశివారికి ఆర్థిక పరిస్థితిలో ఆకస్మిక మార్పులు (29-04-2022)

SREE KRUPA (29-04-2022) రాశి ఫలితాలు

 

మేషం 29-04-2022

Today Horoscope : ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఒక వార్త ఆనందం కలిగిస్తుంది.

వృషభం – 29-04-2022

చేపట్టిన పనులు వాయిదా పడుతాయి. ఆర్థిక పరిస్థితిలో ఆకస్మిక మార్పులు కలుగుతాయి. రుణయత్నాలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులకు కొంత సామాన్యంగా ఉంటుంది వ్యాపారములలో ఆలోచనలు అంతగా కలసిరావు, వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఖర్చులు అదుపులో ఉంచడం మంచిది.

మిధునం – 29-04-2022

చాలాకాలంగా వేధిస్తున్న ఋణ సమస్యలు నుండి బయటపడతారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆర్ధిక లబ్ది పొందుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు.

కర్కాటకం – 29-04-2022

ఇతరులతో వివాదాల నుండి బయట పడతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అభిమానాలు పొందుతారు ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు తీసుకొని చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు లభించిన అవకాశాన్ని జారవిడువకుండా చూసుకోవాలి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.

సింహం – 29-04-2022

సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. కుటుంబ పెద్దల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా మేలైన ఫలితాలుంటాయి. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి.

కన్య – 29-04-2022

ఇతరులు పై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి అనుకున్న సమయానికి పనులు పూర్తికాక నిరాశ కలుగుతుంది. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగ విషయమై అధికారులు నుండి నిందలు పడతారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

తుల – 29-04-2022

గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది.జీవిత భాగస్వామి నుండి ఊహించని సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. వస్తువాహన సౌకర్యాలు పొందుతారు.

వృశ్చికం – 29-04-2022

బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ధనదాయం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆకస్మిక విజయం పొందుతారు. స్ధిరాస్తి వివాదాలు నుండి బయట పడతారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

ధనస్సు – 29-04-2022

ఇతరులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి సంతాన ఆరోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లేని ఆలోచనలు చేసి నష్టపోతారు ఉద్యోగమున విలువైన పత్రాలు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఖర్చులు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది.

మకరం – 29-04-2022

అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది.ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు చేసి లాభపడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు లభిస్తాయి.

కుంభం – 29-04-2022

ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది ఆకస్మిక ధనప్రాప్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఋణ సమస్యల నుండి బయట పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.

మీనం – 29-04-2022

కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు శ్రమాధిక్యత కలుగుతుంది. ఉదర సంభందిత అనారోగ్య సూచనలున్నవి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి.

Girish Panthulu sirimalli.com

Girish Panthulu sirimalli.com

Weekly Horoscope Telugu : ఆ రాశుల వారికి అనుకున్న సమయానికి ధన సహాయం (24-04-2022 నుంచి 30-04-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page