2024-07-27 15:27:39
Today Horoscope : ఆ రాశివారికి ఆప్తుల నుంచి ఊహించని ఆహ్వానాలు (28-04-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశివారికి ఆప్తుల నుంచి ఊహించని ఆహ్వానాలు (28-04-2022)

Today Horoscope : ఆ రాశివారికి ఆప్తుల నుంచి ఊహించని ఆహ్వానాలు (28-04-2022)

SREE KRUPA (28-04-2022) రాశి ఫలితాలు

 

మేషం – 28-04-2022

Today Horoscope : వివాదాలకు దూరంగా ఉండటం మంచిది మిత్రుల నుండి కొంత ఆసక్తి సమాచారం అందుతుంది దూరప్రయాణాలు సూచనలు ఉన్నవి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వ్యాపార ఉద్యోగాలలో అంతంతమాత్రంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది.

వృషభం – 28-04-2022

పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అంచనాలకు మించిన ఆదాయం అందుతుంది నూతన వస్తు లాభాలు పొందుతారు వ్యాపార ఉద్యోగాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిధునం – 28-04-2022

సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారాల్లో ఆశించిన పురోగతి పొందుతారు. ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

కర్కాటకం – 28-04-2022

నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక నిరాశ కలుగుతుంది వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహంగా సాగుతాయి.

సింహం – 28-04-2022

రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక నిరాశ కలుగుతుంది చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపారాలలో శ్రమ అధికమవుతుంది. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు తప్పవు.

కన్య -28-04-2022

భూ సంబంధిత క్రయవిక్రయాలలో విశేషమైన లాభాలు అందుకుంటారు నూతనవ్యక్తుల పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

తుల – 28-04-2022

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధు మిత్రులతో వివాదాలు తీరుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి అధిగమిస్తారు.

వృశ్చికం – 28-04-2022

అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు సోదరులతో ఆస్తి వివాదాలు పెరుగుతాయి. ధన పరంగా ఒడిదుడుకులు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగపరంగా అధికారులతో వివాదానికి దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

ధనస్సు -28-04-2022

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి మానసిక ప్రశాంతత కోసం దైవదర్శనాలు చేసుకోవడం మంచిది వ్యాపార ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

మకరం -28-04-2022

అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి సన్నిహితులు సలహాలు కలిసివస్తాయి నూతన వస్తు లాభాలు పొందుతారు సమాజంలో పెద్దల నుండి సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

కుంభం -28-04-2022

ఇంటాబయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి బంధు మిత్రుల మాటలు మానసికంగా బాధ కలిగిస్తాయి. అధిక శ్రమతో గాని పనులు పూర్తి కావు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఉద్యోగస్తులు ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

మీనం – 28-04-2022

నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ విషయాలలో స్వంత ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది.

—————————————

Girish Panthulu sirimalli.com

Girish Panthulu sirimalli.com

Weekly Horoscope Telugu : ఆ రాశుల వారికి అనుకున్న సమయానికి ధన సహాయం (24-04-2022 నుంచి 30-04-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page