2024-07-27 09:27:21
Today Horoscope: ఆ రాశి వారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు! (24-1-2023) – Sirimalli.com

Today Horoscope: ఆ రాశి వారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు! (24-1-2023)

Today Horoscope: ఆ రాశి వారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు! (24-1-2023)

 

SREE KRUPA (24-1-2023) రాశి ఫలితాలు

మేషం – 24-1-2023

Today Horoscope: ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు స్థాన చలనాలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట ఊహించని వివాదాలు మానసికంగా చికాకు పరుస్తాయి.

వృషభం – 24-1-2023

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలిస్తుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.

మిధునం – 24-1-2023

వృత్తి వ్యాపారాలు లాభాలబాట పడతాయి. పాతమిత్రుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

కర్కాటకం – 24-1-2023

నిరుద్యోగుల శ్రమ వృధాగా మిగులుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కొంత చికాకు పరుస్తాయి. దూరపు బంధువుల నుండి అందిన శుభవార్త కొంత ఊరట కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

సింహం – 24-1-2023

చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణించవు. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఋణ దాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

కన్య – 24-1-2023

వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

తుల – 24-1-2023

సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

వృశ్చికం – 24-1-2023

వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యసమస్యలు కొంత మానసికంగా కలచివేస్తాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి.

ధనస్సు – 24-1-2023

బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి తొలగడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మకరం – 24-1-2023

విలువైన వస్తువుల బహుమతులుగా పొందుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.

కుంభం – 24-1-2023

కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. ధన పరంగా ఇబ్బందులు తప్పవు.

మీనం – 24-1-2023

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. సంతాన విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read: 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

 

Weekly Horoscope: ఈ రాశివారికి అవసరానికి ఆదాయం సమకూరుతుంది!

 

For More Updates Follow us on – Sirimalli Page