2024-07-27 04:42:55
Today Horoscope : ఆ రాశి వారికి అరుదైన అవకాశములు (14-10-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి అరుదైన అవకాశములు (14-10-2022)

Today Horoscope : ఆ రాశి వారికి అరుదైన అవకాశములు (14-10-2022)

SREE KRUPA (14-10-2022) రాశి ఫలితాలు

 

మేషం – 14-10-2022

Today Horoscope : వృత్తి వ్యాపారాలు సామాన్యం సాగుతాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు.

వృషభం – 14-10-2022

బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వివాదాలకు సంబందించి విలువైన విషయాలు సేకరిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు కొంత పురోగమిస్తాయి. రాజకీయ వర్గం వారితో పరిచయాలు పెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

మిధునం – 14-10-2022

చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. వ్యాపార ప్రారంభమునకు అవాంతరాలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. గృహమున కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు.

కర్కాటకం – 14-10-2022

నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రణాళికలు రూపొందించుకుని క్రమపద్ధతిలో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఆత్మీయులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.

సింహం – 14 -10-2022

విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న విధంగా పూర్తి చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది. సంఘంలో విశిష్ట గౌరవ మర్యాదలు పొందుతారు.

కన్య – 14 -10-2022

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. నూతన వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యత పెరుగుతుంది అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు.

తుల – 14-10-2022

ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలలో మరింత జాగ్రత్త వహించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

వృశ్చికం – 14 -10-2022

ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ముఖ్య వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది.

ధనస్సు – 14-10-2022

ఉద్యోగాలలో వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశములు అందుతాయి ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు నూతన వాహన యోగమున్నది చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి.

మకరం – 14-10-2022

దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. బంధువులతో వివాదాలు సర్దుమణుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగాలలో చికాకులు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కుంభం – 14-10-2022

కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుండి కొంత ఇబ్బందులు తప్పవు. స్ధిరాస్తి వివాదాలకు సంభందించి జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

మీనం – 14-10-2022

వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఊహించని లాభాలు ( 09-10-2022 నుంచి 15-10-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page