2024-07-27 14:38:53
Today Horoscope: ఆ రాశి వారికి ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి! (13-5-2023) – Sirimalli.com

Today Horoscope: ఆ రాశి వారికి ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి! (13-5-2023)

Today Horoscope: ఆ రాశి వారికి ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి! (13-5-2023)

SREE KRUPA (13-5-2023) రాశి ఫలితాలు

మేషం – 13-5-2023

Today Horoscope: ముఖ్యమైన వ్యవహారాలలో ఆత్మీయుల సలహాలు తీసుకోని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. అవసరానికి ధనలబ్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఉన్నతికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగమున సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.

వృషభం – 13-5-2023

నూతన వస్తు వాహన లాభాలున్నవి. చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చాలాకాలంగా వేధిస్తున్న చికాకులు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. వ్యాపారాలు లాభాలబాట పడతాయి. ఉద్యోగమున మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

మిధునం – 13-5-2023

రుణభారం వలన మానసికంగా స్థిమితం ఉండదు. వృధాప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి. ఇంటాబయట నూతన సమస్యలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో నిలకడ రాణించవు. ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది.

కర్కాటకం – 13-5-2023

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపార విషయమై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో మీ కష్టం వృధా అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభమున్నది.

సింహం – 13-5-2023

ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు ఆప్తుల నుండి పెట్టుబడులు అందుతాయి. ఇంటా బయట విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులను పొందుతారు.

కన్య – 13-5-2023

ధన వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. నూతన గృహ వాహన కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలుపరచి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు.

తుల – 13-5-2023

చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున ఇతరుల నుండి విమర్శలు తప్పవు.

వృశ్చికం – 13-5-2023

బంధువుల నుండి ఊహించని ఋణ ఒత్తిడి కలుగుతుంది. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. కీలక వ్యవహారాలలో తొందరపాటు వలన గందరగోళ పరిస్థితులుంటాయి. వ్యాపార విషయాలలో భాగస్థులతో విభేదాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

ధనస్సు – 13-5-2023

ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దూర ప్రయాణాలలో కొత్త పరిచయాలు కలుగుతాయి. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు. బంధు మిత్రుల నుండి వివాదాలకు సంభందించిన కీలక సమాచారం అందుతుంది. వ్యాపారమున సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

మకరం – 13-5-2023

చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అధిక కష్టంతో స్వల్ప ఫలితం పొందుతారు. వృత్తి ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

కుంభం – 13-5-2023

ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మీనం – 13-5-2023

బంధువర్గం నుండి వినకూడని మాటలు వినవలసి రావచ్చు. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read:

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

Weekly Horoscope: ఆ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది!

For More Updates Follow us on – Sirimalli Page