2024-07-27 06:09:51
Today Horoscope : ఆ రాశి వారికి కలసివచ్చే ఆప్తుల సలహాలు (12-04-2022) – Sirimalli.com

Today Horoscope : ఆ రాశి వారికి కలసివచ్చే ఆప్తుల సలహాలు (12-04-2022)

Today Horoscope : ఆ రాశి వారికి కలసివచ్చే ఆప్తుల సలహాలు (12-04-2022)

SREE KRUPA (12-04-2022) రాశి ఫలితాలు

మేషం – 12-04-2022

Today Horoscope : చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి కొంత బాధిస్తుంది బంధు వర్గంతో మాట పట్టింపులుంటాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం – 12-04-2022

నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో కష్టం తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధు వర్గంతో మాట పట్టింపులుంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికామౌతాయి.

మిధునం  – 12-04-2022

ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసివస్తాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

కర్కాటకం – 12-04-2022

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. దూరప్రయాణ సూచనలున్నవి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

సింహం – 12-04-2022

నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి.కుటుంబ సభ్యులతో శుభకార్యలకు హాజరువుతారు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశములు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కన్య – 12-04-2022

చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఇంటా బయట పరిస్థితులు ప్రతికూలిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు.

తుల – 12-04-2022

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు వ్యాపారమున స్వంత ఆలోచనలు అమలు చేస్తారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

వృశ్చికం – 12-04-2022

నూతన విషయాలు సేకరిస్తారు. ఉద్యోగమున ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.

ధనస్సు – 12-04-2022

చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృధాఖర్చులు పెరుగుతాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగమున శ్రమాదిక్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

మకరం – 12-04-2022

దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి దైవ చింతన పెరుగుతుంది.

కుంభం – 12-04-2022

దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. రాజకీయ సభ, సమావేశాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి , ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

మీనం – 12-04-2022

చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. ఆప్తుల నుంచి ధన సహాయం అందుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు అందుతాయి.

Girish Panthulu sirimalli.com

Girish Panthulu sirimalli.com

Weekly Horoscope Telugu : ఆ రాశి వారి నిరుద్యోగులు, వ్యాపారస్తులకు అద్భుతమైన అవకాశాలు (10-04-2022 నుంచి 16-04-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page