Today Horoscope : ఆ రాశి వారికి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి (11-04-2022)

Today Horoscope : ఆ రాశి వారికి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి (11-04-2022)

SREE KRUPA (11-04-2022) రాశి ఫలితాలు

 

మేషం – 11-04-2022

Today Horoscope : చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి, ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

వృషభం – 11-04-2022

ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు సమాజంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు పరచి లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

మిధునం – 11-04-2022

ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.

కర్కాటకం – 11-04-2022

సన్నిహితుల నుండి ఆశించిన ధన సహాయం పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఉద్యోగమున పరిస్థితులు అనుకూలిస్తాయి.

సింహం – 11-04-2022

చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. సన్నిహితుల నుండి ఋణ ఒత్తిడులు అధికమవుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపారాలు కొంత మందగిస్తాయి ఉద్యోగంలో ఇతరులతో మాటలు పడవలసి వస్తుంది.

కన్య – 11-04-2022

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి.

తుల – 11-04-2022

ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆప్తులు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది.

వృశ్చికం – 11-04-2022

నూతన ఋణప్రయత్నాలు చేస్తారు ముఖ్యమైన పనులు లో కష్టపడినా ఫలితం కనిపించదు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి బంధువులతో అకారణ వివాదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

ధనస్సు – 11-04-2022

దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కొన్ని పనులు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించాలి. బంధువర్గంతో వివాదాలు కలుగుతాయి వృథా ఖర్చులు చేదాటుతాయి, ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

మకరం – 11-04-2022

నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. సంతానం విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి భూ క్రయవిక్రయాలు కలసి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం – 11-04-2022

కుటుంబ సభ్యులతో అకారణ కలహాలు కలుగుతాయి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఇతరుల పై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు, ఉద్యోగలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

మీనం – 11-04-2022

నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి ఆకస్మిక ధన లాభం సూచనలున్నాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి.

Girish Panthulu sirimalli.com
Girish Panthulu sirimalli.com

Weekly Horoscope Telugu : ఆ రాశి వారి నిరుద్యోగులు, వ్యాపారస్తులకు అద్భుతమైన అవకాశాలు (10-04-2022 నుంచి 16-04-2022)

 

Panchangam Today : ఈ రోజు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే… (11-04-2022)

 

For More Updates Follow us on – Sirimalli Page