Today Horoscope: ఆ రాశి వారికి వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి! (11-1-2023)

Today Horoscope: ఆ రాశి వారికి వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి! (11-1-2023)

 

SREE KRUPA (11-1-2023) రాశి ఫలితాలు

మేషం – 11-1-2023

Today Horoscope: మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. సంతానం ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

వృషభం – 11-1-2023

చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ప్రత్యర్థుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

మిధునం – 11-1-2023

వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు.

కర్కాటకం – 11-1-2023

వ్యాపార, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్య క్షేత్రాలు సందర్శించుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. బంధువులతో విభేదాలు మానసికంగా చికాకుగా వస్తాయి.

సింహం – 11-1-2023

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య – 11-1-2023

పనులు కొన్ని వాయిదా పడుతాయి . కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. స్థిరాస్తి వివాదాలలో శిరో బాధలు తప్పవు

తుల – 11-1-2023

వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. రాజకీయ సంబంధిత సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.

వృశ్చికం – 11-1-2023

నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి

ధనస్సు – 11-1-2023

సోదరులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు.

మకరం – 11-1-2023

ఉద్యోగులకు పనిఒత్తిడులు అధికమవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పనుల్లో ఆటంకాలు తప్పవు. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం – 11-1-2023

నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అవసరానికి సన్నిహితుల సాయం పొందుతారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు

మీనం – 11-1-2023

దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహం కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read: 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

 

For More Updates Follow us on – Sirimalli Page