Today Horoscope : ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభసూచనలు.. నిరుద్యోగుల కల సాకారం.. వివిధ రాశుల (Today Horoscope) ఫలితాలు
Bhakthi Latest

Today Horoscope : ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభసూచనలు.. నిరుద్యోగుల కల సాకారం.. వివిధ రాశుల (Today Horoscope) ఫలితాలు

Today Horoscope : ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభసూచనలు.. నిరుద్యోగుల కల సాకారం.. వివిధ రాశుల (Today Horoscope) ఫలితాలు

SREE KRUPA  (07-09-2021) రాశి ఫలితాలు

మేషం –  07-09-2021
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర   ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో శిరో బాధలు తప్పవు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.  ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.

వృషభం – 07-09-2021
గృహమున ఊహించని సమస్యలు కలుగుతాయి   వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి ప్రయాణాలు వాయిదా పడుతాయి.  ఉద్యోగాలలో పనిభారంతో శారీరక శ్రమ పెరుగుతుంది.

మిధునం –  07-09-2021
మిత్రులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. సోదరులతో స్థిరస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి.  ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి.

కర్కాటకం –  07-09-2021
నూతన ఋణ యత్నాలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణసూచనలున్నవి. బంధువులతో  మాట పట్టింపులుంటాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి వ్యాపారాలలో   గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగమున బాధ్యతలు మరింత పెరుగుతాయి.

సింహం  –  07-09-2021
బంధు మిత్రుల  సహాయ సహకారాలు అందుతాయి సోదరులతో స్థిరస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. నూతన వాహన లాభం ఉన్నది.గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

కన్య –  07-09-2021
బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత నిరుత్సాహం తప్పదు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

తుల –  07-09-2021
నిరుద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు.ఇంటా బయట పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనప్రాప్తి ఉన్నది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో  ఒత్తిడి నుండి బయట పడతారు.

వృశ్చికం –  07-09-2021
సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో  సమస్యలు రాజి అవుతాయి.

ధనస్సు –  07-09-2021
ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. సోదరులతో స్వల్ప మాటపట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. పని ఒత్తిడి వలన శిరో భాధలు తప్పవు వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో గంధరగోళ పరిస్థితులుంటాయి.

మకరం –  07-09-2021
ప్రయాణాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.  ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రుల  నుంచి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మండకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో  చికాకులు పెరుగుతాయి.

కుంభం  –  07-09-2021
ఆకస్మిక  ధన లాభ సూచనలున్నవి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగయత్నాలలో సానుకూల ఫలితాలుంటాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో కొంత  నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి.

మీనం –  07-09-2021
ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. మిత్రుల  నుంచి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంభంధిత వివాదాలు పరిష్కారమౌతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్థులకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది.

Girish-(Purohithulu) Sirimalli.com

Girish (Purohithulu) sirimalli.comGIRISH KULKARNI (PUROHITULU)