Today Horoscope: ఆ రాశి వారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు! (01-7-2023)

Today Horoscope: ఆ రాశి వారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు! (01-7-2023)

SREE KRUPA (01-7-2023) రాశి ఫలితాలు

మేషం – 01-7-2023

Today Horoscope: వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగులు శ్రమ వృధాగా మిగులుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు.

వృషభం – 01-7-2023

స్థిరస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు.

మిధునం – 01-7-2023

స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు నుండి బయటపడతారు. ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

కర్కాటకం – 01-7-2023

కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

సింహం – 01-7-2023

సన్నిహితులతో మాటపట్టింపు తప్పవు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య – 01-7-2023

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారానికి నూతన పెట్టుబడులకు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు నుండి బయట పడతారు.

తుల – 01-7-2023

ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. గృహమున కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది. నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగ విషయాల్లో అధికారూలతో జాగ్రత్తగా వ్యవహారించాలి.

వృశ్చికం – 01-7-2023

కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తిచేస్తారు. ఆదాయ మార్గలు సంతృప్తి కలిగిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ధనస్సు – 01-7-2023

నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది.

మకరం – 01-7-2023

నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి. ధన వ్యవహారాలు ఆశజానాకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.

కుంభం – 01-7-2023

చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

మీనం – 01-7-2023

బంధు మిత్రులుతో అకారణ వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టె విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read:

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

Yearly Horoscope 2023: ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభము కలుగును! ఈ వారం రాశిఫలాలు 

Weekly Horoscope: ఆ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది!

For More Updates Follow us on – Sirimalli Page