2024-07-27 11:15:02
Sunny Leone: మంచు విష్ణుతో సినిమా.. సన్నీ లియోన్ భారీ రెమ్యునరేషన్.. – Sirimalli.com

Sunny Leone: మంచు విష్ణుతో సినిమా.. సన్నీ లియోన్ భారీ రెమ్యునరేషన్..

Sunny Leone: సన్నీ లియోన్ అంటే ఒక సెన్సేషన్. ఒక పార్న్ స్టార్ అయినా కూడా సినిమాల్లోకి వచ్చి తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకుంది సన్నీ. గత కొంతకాలంగా సన్నీ సినిమాలకు దూరంగా ఉంటోంది. ఒకప్పుడు కనీసం స్పెషల్ సాంగ్స్‌లో అయినా మెరిసి మెప్పించేది. కానీ ఈమధ్య అది కూడా లేదు. దీంతో తన ఫ్యాన్స్.. మళ్లీ సన్నీ లియోన్‌ను ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పార్న్ స్టార్ నుండి బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మారిపోయింది సన్నీ లియోన్. పలువురు యంగ్ హీరోలతో జతకట్టడంతో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించింది. చాలావరకు సన్నీ లియోన్ సినిమాల్లో బోల్డ్ సీన్స్ ఉంటాయి. కానీ దానితో పాటు ప్రేక్షకులను కట్టిపడేసే కథ కూడా ఉంటుంది. అయితే అందులో యాక్టర్‌గా కూడా సన్నీకి మంచి మార్కులే పడ్డాయి. అలా బాలీవుడ్ నుండి సౌత్ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది సన్నీ.

Also Read: https://www.sirimalli.com/there-are-the-times-where-captain-got-eliminated-in-bigg-boss-telugu/

బాలీవుడ్ తర్వాత ముందుగా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సన్నీ లియోన్. అక్కడ ఓ స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత మళ్లీ బాలీవుడ్‌కే వెళ్లిపోయింది. కొంతకాలం తర్వాత తెలుగులో కూడా సన్నీ లియోన్ ఎంట్రీ జరిగింది. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘కరెంటు తీగ’ సినిమాలో సన్నీ ఓ కీలక పాత్రలో కనిపించింది. తెలుగులో మొదటి చిత్రమే అయినా.. ఇందులో సన్నీ పాత్రకు ప్రాధాన్యత ఉండడంతో తెలుగువారితో కూడా తాను మంచి యాక్టర్ అనిపించుకుంది.

Sunny Leone Instagram Post: https://www.instagram.com/p/CaymZjpjce_/?utm_source=ig_web_copy_link

ప్రస్తుతం మళ్లీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను చేస్తూ సౌత్‌లో బిజీ అవ్వాలనుకుంటోంది సన్నీ లియోన్. అందుకే మంచు విష్ణు సరసన ఓ సినిమాలో నటించడానికి అంగీకరించింది. ఇప్పటికే తమ్ముడితో సినిమా చేసిన సన్నీ.. త్వరలో అన్నతో ఆడిపాడనుంది. అయితే ఈ మూవీలో నటించడానికి సన్నీకి భారీ రెమ్యునరేషన్నే అందిస్తుందట మూవీ టీమ్. దీనికోసం తాను 20 రోజులు కాల్ షీట్లు కేటాయించగా.. దానికోసం ఏకంగా రూ. 2 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం.