2024-07-27 05:13:47
Krithi Shetty: బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబమ్మ.. త్వరలోనే బాలీవుడ్‌లో.. – Sirimalli.com

Krithi Shetty: బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబమ్మ.. త్వరలోనే బాలీవుడ్‌లో..

Krithi Shetty: మామూలుగా సినీ పరిశ్రమలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. ఒక హీరోయిన్ పది సంవత్సరాలకంటే ఎక్కువ ఇండస్ట్రీలో ఉంది అంటే తనను ప్రేక్షకులు ఎంతగానో అభిమానించి ఉండాలి. అలా కాకుండా కెరీర్ మొదట్లోనే పీక్స్‌ను చూసి తరువాత కనుమరుగు అయిపోయిన వారు కూడా ఉన్నారు. అయితే ఈమధ్య కాలంలో హీరోయిన్‌గా పరిచయమయ్యి మోస్ట్ బిజీగా అయిపోయింది కృతి శెట్టి (Krithi Shetty). తాజాగా ఈ భామ మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందని టాక్.

k3

సినిమా చిన్నది అయినా కూడా అందులో ప్రేక్షకులు మెచ్చే కంటెంట్ ఉంటే దాని హిట్ చిన్నగా మాత్రం ఉండదని ప్రూవ్ చేసిన సినిమా ‘ఉప్పెన’. ఉప్పెనతో దర్శకుడిగా పరిచయమయిన బుచ్చిబాబుకు, హీరోగా డెబ్యూ చేసిన వైష్ణవ్ తేజ్‌కు, హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టికి కూడా పాపులారిటీని తెచ్చిపెట్టింది. అందులోనూ ముఖ్యంగా కృతి డెబ్యూతోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా అయిపోయింది.

Also Read: https://www.sirimalli.com/today-19-march-2022-daily-horoscope-in-telugu/

ప్రస్తుతం కృతి చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అంతే కాకుండా ఇప్పటికీ తనకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇటీవల కోలీవుడ్ నుండి కూడా కృతికి ఆఫర్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.అది కూడా స్టార్ హీరో సూర్య సరసన నటిస్తుందన్న వార్త ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఇంతలోనే కోలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ నిర్మాతలు కూడా కృతికి ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.

Krithi Shetty Latest Instagram Post: https://www.instagram.com/p/CbPXqxFpq8A/

ఎక్కువగా సౌత్ సినిమాలను రీమేక్ చేస్తూ.. హిట్లను తన ఖాతాలో వేసుకునే షాహిద్ కపూర్ త్వరలోనే ఓ కొత్త సినిమాను ప్రారంభించనున్నాడు. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా కృతి శెట్టి ఎంపికయినట్టు సమాచారం. ఇదే గనుక నిజమయితే.. కృతి టాలీవుడ్‌ను ఏలేసినట్టుగా బాలీవుడ్, కోలీవుడ్‌ను కూడా ఏలేస్తుందని తన అభిమానులు ఆశిస్తున్నారు.