Bigg Boss Telugu: కెప్టెన్స్‌గా ఉన్నా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వీరే..
Bigg Boss 5 Telugu Latest

Bigg Boss Telugu: కెప్టెన్స్‌గా ఉన్నా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వీరే..

Bigg Boss Telugu: బిగ్ బాస్ అనేది చాలామంది ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌కు నచ్చే ఓ రియాలిటీ షో. అందుకే ఇది ఏ భాషలో ప్రసారమైన ప్రేక్షకులు దీనిని ఇష్టంగా చూస్తారు. అందుకే ఎక్కువగా గుర్తింపు లేకపోయినా.. బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన అందరూ సెలబ్రిటీలుగానే తిరిగి వెళ్తారు. అందులో చాలామంది ప్రేక్షకులకు చాలా దగ్గరయిపోతారు. కెప్టెన్ అయితే బిగ్ బాస్ ఎలిమినేషన్ తప్పించుకోవచ్చు అనేవి అన్నీ అపోహలు అని మరోసారి ప్రూవ్ అయ్యింది.

బిగ్ బాస్‌లో వారం వారం జరిగే నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. చాలామంది ప్రేక్షకులు ఈ నామినేషన్స్ కోసమే వారమంతా ఎదురుచూస్తారు. అయితే ఈ నామినేషన్స్ నుండి తప్పించుకోవాలంటే కెప్టెన్ అనే ట్యా గ్ ఉంటే సరిపోతుంది. కానీ ఒకవేళ నామినేట్ అయిన తర్వాత కెప్టెన్ అయితే.. అప్పుడు వారిని ఎలిమినేషన్ నుండి మాత్రం కాపాడలేరు. ఒకవేళ వారు కెప్టెన్ అయిన తర్వాత ఎలిమినేట్ అయితే మళ్లీ కెప్టెన్సీ టాస్క్ జరిగే వరకు బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ లేకుండానే నడుస్తుంది.

Also Read: https://www.sirimalli.com/weekly-horoscope-in-telugu-from-20-march-2022-to-26-march-2022/

బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) మొదటి సీజన్‌లో యాక్టర్ సమీర్ కెప్టెన్‌గా ఉండగానే ఎలిమినేట్ అయ్యాడు. తరువాత కొన్ని సీజన్ల వరకు ఇది జరగలేదు. అయితే మళ్లీ బిగ్ బాస్ 4లో అమ్మ రాజశేఖర్‌ కూడా కెప్టెన్‌గా ఉండగానే ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటికి వచ్చేశారు. ఇక తాజాగా ప్రారంభమయిన బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో మొదటిసారి ఇలా జరగనుంది. మొదటిసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ నుండి కెప్టెన్ ఎలిమినేట్ అవ్వనున్నాడు.

ఆర్‌జేగా ఎంతో పాపులారిటీ సంపాదించుకుని.. బిగ్ బాస్ హౌస్‌లో స్థానం దక్కించుకున్నాడు చైతూ (RJ Chaitu). మొదటి నుండి టాస్క్‌లలో, ఎంటర్‌టైన్మెంట్‌లో చురుగ్గా ఉన్నా.. ఎందుకో తాను ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాడు. అందుకే ఈవారం చైతూనే ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఈ విషయం టెలికాస్ట్ అవ్వకముందే చైతూకు సపోర్ట్ చేసే ఆర్‌జే కాజల్ ఓ హార్ట్ బ్రేక్ ఎమోజీ పెట్టి అందరికీ క్లారిటీ ఇచ్చేసింది.