2024-07-27 10:32:33
Today Horoscope : 02-08-2021 సోమవారం… నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 02-08-2021 సోమవారం… నేటి రాశిఫలాలు..

Today Horoscope : 02-08-2021 సోమవారం… నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (02-08-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

సన్నిహితులతో కీలక విషయాలను చర్చిస్తారు చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్ధిరాస్తి ఒప్పందాలలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్న పాటి మనస్పర్ధలు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

వృషభ రాశి (Taurus) :

వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సోదరులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఆర్ధిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.

మిధున రాశి (Gemini) :

గృహమున విలువైన పత్రాలు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరుద్యోga ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి (Cancer) :

కుటుంబ పెద్దలతో చిన్నపాటి వివివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో నూతన ప్రణాలికలు అమలుపరచి సకాలంలో పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు.

సింహ రాశి (Leo) :

చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు చిన్ననాటి మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో మాట పట్టింపులు ఉంటాయి. భూ సంబంధిత వ్యాపారస్తులకు కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య రాశి (Virgo) :

కుటుంబ వాతావరణం అనుకూలిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దైవ సేవ కార్యాక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

Sree Krupa
Sree Krupa

తుల రాశి (Libra) :

వృధా ఖర్చులు పెరుగుతాయి. వాహన సంభందమైన సమస్యలు కలుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబమున మీ ఆలోచనలు ఎవ్వరికీ నచ్చవు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అమలు పరచడం మంచిది.

వృశ్చిక రాశి (Scorpio) :

సన్నిహితుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. శత్రువుల పై ఆధిక్యత సాధిస్తారు. రాబడి మార్గాలు సంతృప్తి కరంగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. బంధువులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.

ధనస్సు రాశి (Sagitarus) :

రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలుంటాయి. గృహమున కొన్ని సంఘటనలు గందరగోళంగా ఉంటాయి. వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు.

మకర రాశి (Capricorn) :

ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. దైవ సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు.

కుంభ రాశి (Aquarius) :

అన్ని రంగాల వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టే పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయగలుగుతారు. సన్నిహితుల నుండి అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు.

మీన రాశి (Pisces) :

చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికం అవుతుంది దీర్ఘకాలిక ఋణ భారం అధికమౌతుంది. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read : Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (01-08-2021 నుంచి 07-08-2021 వరకు)

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 02-08-2021 సోమవారం … నేటి పంచాంగం…

తాజా సమాచారం కోసం మాసిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి
Https://Www.Facebook.Com/SirimalliPage