2024-07-27 05:51:20
Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఆ పనుల్లో ఆకస్మిక విజయం ! (14-08-2022 నుంచి 20-08-2022) – Sirimalli.com

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఆ పనుల్లో ఆకస్మిక విజయం ! (14-08-2022 నుంచి 20-08-2022)

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి ఆ పనుల్లో ఆకస్మిక విజయం ! (14-08-2022 నుంచి 20-08-2022)

SREE KRUPA

 

వార ఫలాలు – మేషం

Weekly Horoscope Telugu : వార రాశిఫలాలు (14-08-2022 to 20-08-2022) కీలక సమయంలో స్నేహితుల సహాయం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.దీర్ఘ కాలికంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. గృహ నిర్మాణయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం చివరిలో బంధు వర్గం వారితో అకారణ వివాదాలుంటాయి. లలిత త్రిశతి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు

వార ఫలాలు – వృషభం

వార రాశిఫలాలు (14-08-2022 to 20-08-2022) గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. స్వంత నిర్ణయాలతో ఇంటా బయట వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తొలగి రుణాలు తీర్చగలరు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టి తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సకాలంలో పనులు పూర్తి చేసి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. దుర్గాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – మిథునం

వార రాశిఫలాలు (14-08-2022 to 20-08-2022) చిన్ననాటి మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. వారం ప్రారంభంలో పనులందు స్వల్ప అవరోధలుంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. చేపట్టిన అన్ని పనులలో విజయం సాధిస్తారు. భూ సంభంధిత వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. సంతాన విద్యా విషయంలో అనుకున్న ఫలితాలు పొందుతారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి నుండి స్థిరస్తి లాభాలు పొందుతారు. వ్యాపారాలలో అవసరానికి పెట్టుబడులు అందుతాయి. అన్ని రంగాల వారికి విశేషమైన ఫలితాలుంటాయి. బంధువులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగాలలో నూతన భాద్యతలు చేపడతారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. శ్రీ కృష్ణ కవచం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కర్కాటకం

వార రాశిఫలాలు (14-08-2022 to 20-08-2022) ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తిచేస్తారు ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.స్థిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సన్నిహితులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. శారీరక అనారోగ్య సమస్యలు బాదిస్తాయి.గృహ, వాహన యోగమున్నది. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశములు దక్కించుకుంటారు. కొన్ని రంగాల వారికి నూతన ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. గరుడ కవచం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – సింహం

వార రాశిఫలాలు (14-08-2022 to 20-08-2022) కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థికంగా మరింత అనుకూల పరిస్థితులుంటాయి. బంధువులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృధా ఖర్చులుంటాయి. జగన్నాధాష్టకం పారాయణ చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కన్య

వార రాశిఫలాలు (14-08-2022 to 20-08-2022) రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు వర్గం వారి నుండి కీలక విషయాలు సేకరిస్తారు. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన పనుల్లో ఆకస్మిక విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వాహన యోగం ఉన్నది.వ్యాపారాలలో నష్టాలను అదిగమిస్తారు ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. స్థిరస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. అన్ని రంగాల వారికి అరుదైన అవకాశములు అందుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. శివరామాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – తుల

వార రాశిఫలాలు (14-08-2022 to 20-08-2022) వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కారంలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రముఖ వ్యక్తులు పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలలో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. సూర్య పంజర స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – వృశ్చికం

వార రాశిఫలాలు (14-08-2022 to 20-08-2022) పోటీపరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి. వారం ప్రారంభంలో ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. చాలకాలంగా పూర్తికాని పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. కీలక సమయంలో ఆత్మీయులు సలహాలు కలసివస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు సర్దుకుంటాయి. దక్షిణమూర్తి పంచరత్న స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – ధనస్సు

వార రాశిఫలాలు (14-08-2022 to 20-08-2022) కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సోదరులతో వివాదాలనూ తెలివిగా పరిష్కరించుకుంటారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ధన సహాయం అందుతుంది. వారం మధ్యలో బంధు వర్గంతో విరోదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలొ సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. లక్ష్మి నరసింహ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – మకరం

వార రాశిఫలాలు (14-08-2022 to 20-08-2022) వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి.వృత్తి వ్యాపారాలలో శ్రమ మరింత పెరుగుతుంది. అనుకున్న పనుల్లో జాప్యం కలిగిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అధిగమిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత నిరాశాజనకంగా సాగుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ధన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. బంధువర్గం నుంచి కీలక సమాచారం అందుతుంది. అన్నిరంగాల వారికి ఆశించిన ఫలితాలుంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు పెరుగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. హనుమదష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కుంభం

వార రాశిఫలాలు (14-08-2022 to 20-08-2022) స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. కొన్ని పనులు సమయానికి పూర్తి చేస్తారు.కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులను కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వారం చివరిలో ధనవ్యయ సూచనలున్నవి. వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన వాహన, ఆభరణాలు కొనుగోలుచేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.కొన్ని రంగాల వారికి మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. సుబ్రమణ్య మంగళష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – మీనం

వార రాశిఫలాలు (14-08-2022 to 20-08-2022) బంధు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వారం ప్రారంభంలో ధనవ్యయ సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో పురోగతి సాధిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి.గృహ వాతవరణం గందరగోళంగా ఉంటుంది నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. అన్నిరంగాల వారి అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగమున తెలివితేటలతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page