Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి అప్పుల బాధలు తొలగిపోతాయి! (11-09-2022 నుంచి 17-09-2022)

Weekly Horoscope Telugu : ఆ రాశి వారికి అప్పుల బాధలు తొలగిపోతాయి! (11-09-2022 నుంచి 17-09-2022)

SREE KRUPA

వార ఫలాలు – మేషం

Weekly Horoscope Telugu : వార రాశిఫలాలు (11-09-2022 to 17-09-2022) కీలక సమయంలో స్నేహితుల సహాయం అందుకుంటారు. దీర్ఘ కాలికంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. వారం చివరిలో బంధు వర్గం వారితో అకారణ వివాదాలుంటాయి. గృహ నిర్మాణయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. విష్ణు పంజర స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – వృషభం

వార రాశిఫలాలు (11-09-2022 to 17-09-2022) చాలకాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. స్వంత నిర్ణయాలతో ఇంటా బయట వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. నూతన వాహనయోగం ఉన్నది. ఆర్థికంగా ఇబ్బందులు తొలగి రుణాలు తీర్చగలరు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టి తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు సకాలంలో పనులు పూర్తి చేసి అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.చిన్నతరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – మిథునం

వార రాశిఫలాలు (11-09-2022 to 17-09-2022) భూ సంభంధిత వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. చేపట్టిన అన్ని పనులలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది జీవిత భాగస్వామి నుండి స్థిరస్తి లాభాలు పొందుతారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. సంతాన విద్యా విషయంలో అనుకున్న ఫలితాలు పొందుతారు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అవసరానికి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతన భాద్యతలు చేపడతారు. అన్ని రంగాల వారికి విశేషమైన ఫలితాలుంటాయి. వారం ప్రారంభంలో పనులందు స్వల్ప అవరోధలుంటాయి. బంధువులతో మాటపట్టింపులుంటాయి ఆంజనేయస్వామి ఆరాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కర్కాటకం

వార రాశిఫలాలు (11-09-2022 to 17-09-2022) నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశములు దక్కించుకుంటారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తిచేస్తారు ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. గృహ, వాహనయోగమున్నది. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి నూతన ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. శారీరక అనారోగ్య సమస్యలు బాదిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.స్థిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. రామారక్ష స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – సింహం

వార రాశిఫలాలు (11-09-2022 to 17-09-2022) కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థికంగా మరింత అనుకూల పరిస్థితులుంటాయి. బంధువులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ సేవాకార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది వృధా ఖర్చులుంటాయి. కనకధారా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కన్య

వార రాశిఫలాలు (11-09-2022 to 17-09-2022) బంధు వర్గం వారి నుండి కీలక విషయాలు సేకరిస్తారు. స్థిరస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వాహన యోగం ఉన్నది. వ్యాపారాలలో నష్టాలను అదిగమిస్తారు అన్ని రంగాల వారికి అరుదైన అవకాశములు అందుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. ముఖ్యమైన పనుల్లో ఆకస్మిక విజయం సాధిస్తారు. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. గణపతి ఆరాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – తుల

వార రాశిఫలాలు (11-09-2022 to 17-09-2022) ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. రాజకీయ వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారంలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటారు. ప్రముఖ వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు పరీక్షలలో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నవగ్రహ ఆరాధనా చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – వృశ్చికం

వార రాశిఫలాలు (11-09-2022 to 17-09-2022) కీలక సమయంలో ఆత్మీయులు సలహాలు కలసివస్తాయి. వారం ప్రారంభంలో ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు సర్దుకుంటాయి. చాలకాలంగా పూర్తికాని పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. గృహమున శుభాకార్యములు నిర్వహిస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. పోటీపరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. విష్ణుసహస్రనామస్తోత్రం పారాయణ చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – ధనస్సు

వార రాశిఫలాలు (11-09-2022 to 17-09-2022) కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సోదరులతో వివాదాలనూ తెలివిగా పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి ధన సహాయం అందుతుంది. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల బాటలొ సాగుతాయి. వారం మధ్యలో బంధు వర్గంతో విరోదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దుర్గాదేవి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – మకరం

వార రాశిఫలాలు (11-09-2022 to 17-09-2022) బంధువర్గం నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమ మరింత పెరుగుతుంది. ధన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. అనుకున్న పనుల్లో జాప్యం కలిగిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అధిగమిస్తారు. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత నిరాశాజనకంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. అన్నిరంగాల వారికి ఆశించిన ఫలితాలుంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కుంభం

వార రాశిఫలాలు (11-09-2022 to 17-09-2022) సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కొన్ని పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. నూతన వాహన, ఆభరణాలు కొనుగోలుచేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వారం చివరిలో ధనవ్యయ సూచనలున్నవి. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ప్రత్యర్థులను కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. కొన్ని రంగాల వారికి మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. దత్త పంజర స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – మీనం

వార రాశిఫలాలు (11-09-2022 to 17-09-2022) దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. బంధు , మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వారం ప్రారంభంలో ధనవ్యయ సూచనలున్నవి.ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులలో పురోగతి సాధిస్తారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. అన్నిరంగాల వారి అంచనాలు నిజమవుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహ వాతవరణం గంధరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగమున తెలివితేటలతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. శివ సహస్రనామా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

Girish kulakarni purohithulu sirimalli.com

Girish kulakarni purohithulu sirimalli.com

Also Read : 

Horoscope 2022 : 2022-2023 శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు

 

For More Updates Follow us on – Sirimalli Page