Weekly Horoscope Telugu : ఆ రాశి వారు వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి తెలివిగా బయటపడతారు

Weekly Horoscope Telugu : ఆ రాశి వారు వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి తెలివిగా బయటపడతారు

వార ఫలాలు – మేషం

Weekly Horoscope Telugu : వార ఫలాలు (02-01-2022) నుండి (08-01-2022) వరకు చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. నిరుద్యోగులు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.సోదరులతో స్థిరాస్తి వివాదాలలో నెలకొన్న సందిగ్ధత తొలగుతుంది. కుటుంబంలో శుభకార్యాలపై పెద్దలతో చర్చలు చేస్తారు. గృహనిర్మాణ విషయంలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా కాస్త మెరుగైన పరిస్థితులుంటాయి. చిన్న తరహా పరిశ్రమలు క్రమ క్రమంగా లాభాల బాట పడుతాయి. ఉద్యోగాలలో విధులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కొన్ని రంగాల వారికి శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణా సూచనలు ఉన్నవి.నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు గణనాయక అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వార ఫలాలు – వృషభం

వార ఫలాలు (02-01-2022) నుండి (08-01-2022) వరకు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సన్నిహితుల ప్రోత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల పరీక్ష ఫలితాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి తెలివిగా బయట పడతారు. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప ధనవ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.

వార ఫలాలు – మిథునం

వార ఫలాలు (02-01-2022) నుండి (08-01-2022) వరకు చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వారం మధ్యలో ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించిన నూతన అవకాశాలు అనుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తిస్తారు కొన్ని రంగాల వారికి ఆశలు అంతగా ఫలించవు. వారం చివరిలో మిత్రులతో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కర్కాటకం

వార ఫలాలు (02-01-2022) నుండి (08-01-2022) వరకు నూతన కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కీలక విషయాలు గూర్చి చర్చిస్తారు. దైవ సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆర్థికంగా మరింత లాభాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వారం మధ్యలో ఒక వివాదాన్ని అత్యంత ఓర్పుతో పరిష్కరించుకుంటారు.సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు క్రమంగా లాభాల బాట నడుస్తాయి. ఉద్యోగాలలో ఊహించని స్థాన చలనాలు తప్పవు. చిన్న తరహా పరిశ్రమలకు వ్యవహారాలలో విజయం. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణ సూచనలు. సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – సింహం

వార ఫలాలు (02-01-2022) నుండి (08-01-2022) వరకు ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. విద్యార్థులు పరీక్షఫలితాలు కొంత ఊరట ఇస్తాయి.దైవకార్యాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అంది అవసరాలు తీరుతాయి.శత్రువులను కూడా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. గృహమున మీ నిర్ణయాలు అందరికి నచ్చుతాయి.సోదరులతో సఖ్యతగా వ్యవహారిస్తారు వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుండి బయట పడతారు. కొన్ని రంగాల వారికి ఒత్తిడుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు. అనారోగ్యం సమస్యలు నవగ్రహ కవచం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కన్య

వార ఫలాలు (02-01-2022) నుండి (08-01-2022) వరకు వారం ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఉన్నపటికీ అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు. నిరుద్యోగుల ఊహలు నిజం అవుతాయి. విద్యార్థులకు అప్రయత్నంగా నూతన అవకాశములు దక్కించుకుంటారు. దాయదులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. కొన్ని రంగాల వారికి మార్పులు తప్పవు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వారం ప్రారంభంలో దూరప్రయాణ సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికి రాదు. విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణ చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – తుల

వార ఫలాలు (02-01-2022) నుండి (08-01-2022) వరకుపట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు గృహమున శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉంటుంది. సంఘంలో మర్యాదలకు లోటు ఉండదు. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నూతన గృహప్రవేశం నిర్మాణం ప్రయత్నాలు ప్రారభిస్తారు వ్యాపారాలలో గతం కంటే మంచి లాభాలు అందుతాయి ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది అన్ని రంగాల వారికీ నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఉంటుంది. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి వృధా ఖర్చులు పెరుగుతాయి. కాలభైరవాష్టకం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – వృశ్చికం

వార ఫలాలు (02-01-2022) నుండి (08-01-2022) వరకు ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులులో జాప్యం కలుగుతుంది బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. భూ సభంధిత క్రయ విక్రయలు కలసిరావు.గృహ నిర్మాణ యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన సమయానికి నిద్రహారాలు ఉండవు. చిన్నతరహా పరిశ్రమలకు శ్రమధిక్యత తప్పదు. వారం మధ్యలో చిన్న నాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – ధనస్సు

వార ఫలాలు (02-01-2022) నుండి (08-01-2022) వరకు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. పాత విషయాలు కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. గృహ నిర్మాణయత్నాలు సానుకూలమౌతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ నిర్ణయాలను ఇంటా బయట అందరు గౌరవిస్తారు. వ్యాపారాలలో సమస్యలు అదిగమించి లాభాలు అందుకుంటారు.ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దుర్గాఖడ్గమాల స్తోత్రాలు పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – మకరం

వార ఫలాలు (02-01-2022) నుండి (08-01-2022) వరకు చిన్న నాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. నూతన వ్యక్తులు పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆస్తుల క్రయవిక్రయాలలో సమస్యలు తొలగుతాయి. గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. విద్యార్థులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన లక్ష్యాలు సాధిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. బంధువులతో ఆకారణ వివాదాలు తప్పవు. హయగ్రీవస్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – కుంభం

వార ఫలాలు (02-01-2022) నుండి (08-01-2022) వరకు సన్నిహితుల సాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలకు లోటు ఉండదు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు తెలివితో కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులలో ఆశలు ఫలిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం పెరుగుతాయి. వ్యాపారాలు క్రమంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో వృధా ప్రయాణాలు ఉంటాయి. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. ఇంద్రకృత లక్ష్మి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వార ఫలాలు – మీనం

వార ఫలాలు (02-01-2022) నుండి (08-01-2022) వరకు కుటుంబసభ్యులు మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది చిన్నతరహా పరిశ్రమల శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. హనుమాన్‌ చాలీసా పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

Girish Purohithulu sirimalli.com
Girish Purohithulu sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)