2024-07-27 05:02:29
Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (11-07-2021 నుంచి 17-07-2021 వరకు) – Sirimalli.com

Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (11-07-2021 నుంచి 17-07-2021 వరకు)

Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (11-07-2021 నుంచి 17-07-2021 వరకు) కింది విధంగా ఉన్నాయి. మేష రాశి నుంచి మీన రాశి వరకు వారఫలాలు (Weekly Horoscope) అన్నీ వరుస క్రమంలో ఇవ్వడం జరిగింది.

SREE KRUPA (Weekly Horoscope)

మేషం (Aries) :

వార ఫలాలు (11-07-2021) నుండి (17-07-2021) వరకు నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి పాత మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలుతీర్చగలుగుతారు. సన్నిహితులనుండి గృహనిర్మాణానికి సహాయ సహకారాలు అందుతాయి. దూరప్రాంత బంధు మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. చిన్నతరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో ధన పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభం (Taurus) :

వార ఫలాలు (11-07-2021) నుండి (17-07-2021) వరకు నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.చాలాకాలంగా ఉన్న సమస్యలను క్రమక్రమంగా అధిగమిస్తారు. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలను రాజీ చేసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. నూతన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి అన్ని రంగాల వారికి కార్యసిద్ధి కలుగుతుంది వారం చివరన చేపట్టిన పనులు మందగిస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. గురుచరిత్ర పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

మిధునం (Gemini) :

వార ఫలాలు (11-07-2021) నుండి (17-07-2021) వరకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలతో విభేదిస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత జాప్యం తప్పదు. నిరుద్యోగులకు మరింత శ్రమ తప్పదు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుకుంటారు. మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

కర్కాటకం (Cancer) :

వార ఫలాలు (11-07-2021) నుండి (17-07-2021) వరకు ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా మారతాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు.సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుని బాధపడతారు. గృహ నిర్మాణం పనులు వేగవంతం చేస్తారు. సంతానం విద్యా విషయాలలో కీలక సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలు పొందుతారు. వారం చివరలో పనులు మందకొడిగా సాగుతాయి ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతున్నారు

సింహం (Leo) :

వార ఫలాలు (11-07-2021) నుండి (17-07-2021) వరకు చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూలత పెరుగుతుంది. వారం ప్రారంభంలో ఆర్ధిక ఇబ్బందులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కొన్ని వ్యవహారాలలో శ్రమతో కానీ పనులు పూర్తి కావు. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య (Virgo) :

వార ఫలాలు (11-07-2021) నుండి (17-07-2021) వరకు ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందాయి. వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.చిన్నతరహా పరిశ్రమలకునూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు కొంత కలచివేస్తాయి . దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

తుల (Libra) :

వార ఫలాలు (11-07-2021) నుండి (17-07-2021) వరకు నూతనోత్సాహంతో కొన్ని పనులను పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలుఅనుకూలిస్తాయి.ఆకస్మికధనప్రాప్తి, ఉద్యోగస్తులకు చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.. కొన్ని రంగాల్లో వారికి పరిస్థితులు అనుకూలించి పుంజుకుంటారు. సంతాన విద్యా ఫలితాలు ఆనందం కలిగిస్తాయి. వారం మధ్యలో ఆదాయ మార్గాలు తగ్గుతాయి. ఇంటా బయట కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చికం (Scorpio) :

వార ఫలాలు (11-07-2021) నుండి (17-07-2021) వరకు ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగుతారు చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని ఊహించని సంఘటనలు ఎదురైనా నిదానంగా ముందుకు సాగుతారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. వారం ప్రారంభంలో సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కనకధారా స్తోత్రం పారాయణం చేయడం మంచిది వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు (Sagitarus) :

వార ఫలాలు (11-07-2021) నుండి (17-07-2021) వరకు ఇంటాబయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా కొంత మెరుగైన వాతావరణం ఉంటుంది దీర్ఘకాలిక రుణాలు నుండి ఉపశమనం పొందుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో పట్టుదలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలమౌతాయి ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు అధికారుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు

మకరం (Capricorn) :

వార ఫలాలు (11-07-2021) నుండి (17-07-2021) వరకు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహమున ఆత్మీయ ఆగమన ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో బంధుమిత్రులతో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో నష్టాలను అధిగమించి ముందుకు సాగుతారు ఉద్యోగాలు మీ పనితీరు తో అందరినీ ఆకట్టుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. వారం మధ్యలో ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభం (Aquarius) :

వార ఫలాలు (11-07-2021) నుండి (17-07-2021) వరకు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు పాత మిత్రులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగగైన ఫలితాలు ఉంటాయి. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు ప్రభుత్వ వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరలో శ్రమతో కానీ పనులు పూర్తికావు. ధనపరమైన ఒడిదుడుకులు కలుగుతాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీనం (Pisces) :

వార ఫలాలు (11-07-2021) నుండి (17-07-2021) వరకు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు అవసరానికి ఇతరుల నుండి సహాయం అందుతుంది ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. జీవిత భాగస్వామి నుండి స్థిరాస్తి లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు గృహమున మీ నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. నవగ్రహ కవచం పారాయణం చెయ్యడం వలన ఉత్తమ ఫలితాలను పొందుతారు.

 

Girish-(Purohithulu)
Girish (Purohithulu)

Weekly Horoscope

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 11-07-2021 ఆదివారం … నేటి పంచాంగం..

Also Read : International Yoga Day : యోగాలో 84 లక్షల ఆసనాలు!.. ఏ వయసువారు ఎలాంటి యోగాసనాలు వేయవచ్చంటే..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage