2024-07-27 01:56:15
Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (04-07-2021 నుంచి 10-07-2021 వరకు) – Sirimalli.com

Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (04-07-2021 నుంచి 10-07-2021 వరకు)

Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు (04-07-2021 నుంచి 10-07-2021 వరకు) కింది విధంగా ఉన్నాయి. మేష రాశి నుంచి మీన రాశి వరకు వారఫలాలు (Weekly Horoscope) అన్నీ వరుస క్రమంలో ఇవ్వడం జరిగింది.

SREE KRUPA (Weekly Horoscope)

మేషం (Aries) :

ముఖ్యమైన వ్యవహారాలలో నూతన ప్రణాళికలు చేసి విజయం సాధిస్తారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి నూతన ఒప్పందాలు చేసుకుంటారు నిరుద్యోగులు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఉద్యోగస్తులకు నూతన పథకాలు అందుతాయి చిన్న తరహా పరిశ్రమలకు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు వారం మధ్యలో ధనవ్యయం సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభం (Taurus) :

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మీ ఆలోచనలు కుటుంబ సభ్యులు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది దీర్ఘకాలిక రుణాలను తీర్చ గలుగుతారు దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు లేక స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నా అధిగమించి ముందుకు సాగుతారు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు సఫలమౌతాయి వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి ఉద్యోగస్తులకు ఆశించిన స్థానచలన సూచనలు ఉన్నవి వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. పనులలో శ్రమ అధికం అవుతుంది ఆంజనేయస్వామి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మిధునం (Gemini) :

కొన్ని వ్యవహారాలలో చిన్నపాటి మార్పులు చేసి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు అధిగమిస్తారు స్థిరాస్తి కొనుగోలుకు ధన సహాయం లభిస్తుంది శత్రు సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. సోదరులతో ఆస్తి విషయంలో నెలకొన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఉత్సాహకరంగా వాతావరణం ఉంటుంది.ఉద్యోగస్తులకు అధికారులతో వివాదాలు సద్దుమణిగి నూతన అవకాశాలు లభిస్తాయి. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం సూచనలు కలవు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.వినాయకుడిని ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను

కర్కాటకం (Cancer) :

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు అంది అవసరాలు తీరుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు ఉత్సాహం కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో అవరోధాలు తొలగుతాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు ఉద్యోగస్తులు పనితీరు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు కొన్ని రంగాలవారికి నూతన అవకాశములు లభిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు కొంత కలవరపరుస్తాయి రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

సింహం (Leo) :

చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ఇంటా బయట విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత ఊరట కలిగించే సమాచారం తెలుస్తుంది. సోదరులతో వివాదాలకు సంబంధించి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలుఅందుతాయి. గృహనిర్మాణ ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు గందరగోళ పరిస్థితులు తొలగి ఉపశమనం పొందుతారు చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అంది నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు వారం ప్రారంభంలో బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి మానసికంగా అశాంతి కలుగుతుంది ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య (Virgo) :

వారం ప్రారంభంలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి మీరు తీసుకున్న నిర్ణయాలు కుటుంబసభ్యులు విభేదిస్తారు క్రమక్రమంగా సమస్యలను అధిగమించి శుభ ఫలితాలను పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దశకు చేరుకుంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు నూతన వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. జీవిత భాగస్వామి సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వారం ప్రారంభంలో అనారోగ్య సమస్యలు బాధిస్తాయి సోదరులతో ఊహించే కలహాలు పెరుగుతాయి గురుచరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

తుల (Libra) :

మొండి బకాయిలు వసూలవుతాయి. గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల సహాయసహకారాలతో పనులు పూర్తిచేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలసివస్తాయి. నూతన వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగమున భాద్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయ సభా సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. సంతాన వివాహ ప్రయత్నాలు కలిసొస్తాయి వారం మధ్యలో వృథాఖర్చులు చేస్తారు ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చికం (Scorpio) :

సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకొని బాధపడతారు స్థిరాస్థి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా వారం మధ్యలో నూతన ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి చిన్న తరహా పరిశ్రమలకు శుభవార్తలు అందుతాయి వారం చివరన బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి ప్రయాణాలు వాయిదా పడతాయి గణపతి ఆరాధనా చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు (Sagitarus) :

ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది గృహ కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి సంతాన వివాహ విషయాలపై కుటుంబ సభ్యులతో చర్చలు వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వారం ప్రారంభంలో బంధు మిత్రులతో వివాదాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి శివ సహస్ర నామ స్తోత్ర పారాయణం వలన శుభ ఫలితాలు ఫలితాలు.

మకరం (Capricorn) :

నూతన కార్యక్రమాలను చేపడతారు మీ ఆలోచనలో ఇంటా బయట అందరికీ నచ్చే విధంగా ఉంటాయి ఆర్థికంగా మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి నుండి బయట పడతారు సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి వ్యాపార వ్యవహారాల్లో బంధుమిత్రులు సలహాలు కలసివస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కొన్ని వ్యవహారాలలో ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతారు వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఉద్యోగులకు అధికారులతో ఉన్న సమస్యల నుండి బయట పడతారు కొన్ని రంగాల వారికి అరుదైన అవకాశములు లభిస్తాయి వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నవి ఇతరులకు ధన విషయంలో మాట ఇవ్వడం మంచిది కాదు కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది మేధా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కుంభం (Aquarius) :

అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది.మిత్రులతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు. కొన్ని వ్యవహారాలలో ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి జరుపుతారు. కుటుంబ సభ్యులతో సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. చిన్నతరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. వారం మధ్యలో దూరప్రయాణ సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. విష్ణు పంజర స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మీనం (Pisces) :

ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలు నిలకడ లోపిస్తుంది. కుటుంబసభ్యులతో ఊహించని వివాదాలు చోటుచేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. భూ సంభందిత క్రయ విక్రయాలు అంతగా అనుకూలించవు. ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. మిత్రుల నుండి అందిన శుభవార్తలు కొంత ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. నూతన రుణయత్నాలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. కొన్ని రంగాల వారికి అంచనాలు ఫలించవు. వారం మధ్యలో జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. లక్ష్మి దేవి ఆరాధనా చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

Weekly Horoscope

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Horoscope : 04-07-2021 ఆదివారం … నేటి రాశిఫలాలు..

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 04-07-2021 ఆదివారం… నేటి పంచాంగం..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage