2024-07-27 01:43:22
Today Horoscope : 04-07-2021 ఆదివారం … నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 04-07-2021 ఆదివారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 04-07-2021ఆదివారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (04-07-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తొలగుతాయి. వృత్తి వ్యాపార పరమైన కొన్ని వ్యవహారాలలో పట్టుదలతో ముందుకు సాగుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నవి. ఉద్యోగ వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది.

వృషభ రాశి (Taurus) :

ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి కాక చికాకులు పెరుగుతాయి. ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. జీవితభాగస్వామి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగస్థులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు.

మిధున రాశి (Gemini) :

చిన్ననాటి మిత్రులతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది. పాతరుణాలు తీర్చగలుగుతారు. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటక రాశి (Cancer) :

ఆర్థికంగా పరిస్థితి కొంత మెరుగుపడుతుంది నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది సోదరులతో స్థిరాస్థి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి నూతన భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

సింహ రాశి (Leo) :

వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్యవిషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.

కన్య రాశి (Virgo) :

ముఖ్యమైన వ్యవహారాలలో చర్చలు అనుకూల ఫలితాన్నిస్తాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్థి క్రయవిక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.

Sree Krupa
Sree Krupa

తుల రాశి (Libra) :

నూతన ఋణప్రయత్నాలు కలసి వస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి.

వృశ్చిక రాశి (Scorpio) :

చేపట్టిన పనులలో అధిక శ్రమకు అల్ప ఫలితాన్ని పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు కొన్ని విషయాలలో కలసివస్తాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

ధనస్సు రాశి (Sagitarus) :

వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు రాజి చేసుకుంటారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొని మానసిక ప్రశాంతత పొందుతారు వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు.

మకర రాశి (Capricorn) :

రాజకీయ సంబంధిత చర్చలో పాల్గొంటారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాట పడతారు. క్రయవిక్రయాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి.

కుంభ రాశి (Aquarius) :

కుటుంబ విషయాలపై పెద్దలతో చర్చలు జరుపుతారు చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి చాలా కాలంగా వేచిచూస్తున్న అవకాశాలను దక్కించుకుంటారు దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా బయటపడతారు ధన పరమైన ఇబ్బందులు కొంత చికాకు కలిగిస్తాయి కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు.

మీన రాశి (Pisces) :

నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఉంటాయి చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. పాత మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 04-07-2021 ఆదివారం… నేటి పంచాంగం..

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage