2024-07-27 05:12:23
Today Horoscope : 26-08-2021 గురువారం … నేటి రాశిఫలాలు.. – Sirimalli.com

Today Horoscope : 26-08-2021 గురువారం … నేటి రాశిఫలాలు..

Today Horoscope : 26-08-2021 గురువారం … నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశులఫలితాలు (Today Horoscope) ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (26-08-2021) రాశి ఫలితాలు

మేష రాశి (Aries) :

చేపట్టిన పనులో ప్రతిష్టంభనలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. దైవదర్శనాలు చేసుకుంటారు వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోక పోవడం మంచిది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

వృషభ రాశి (Taurus) :

వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలుకు లోటు ఉండదు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మిధున రాశి (Gemini) :

చిన్ననాటి మిత్రులతో విందువినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలోనూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి.

కర్కాటక రాశి (Cancer) :

సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.ధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేక అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.

సింహ రాశి (Leo) :

దూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు వృత్తి వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

కన్య రాశి (Virgo) :

నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

Sree Krupa
Sree Krupa

తుల రాశి (Libra)

నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. కుటుంబసభ్యులు సలహాలు కొన్ని విషయాల్లో కలిసి వస్తాయి. స్ధిరాస్తి సంభందిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.

వృశ్చిక రాశి (Scorpio) :

ధన పరంగా తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. ఉద్యోగమున సమస్యలు కలుగుతాయి.

ధనస్సు రాశి (Sagitarus) :

కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా బంధువులతో వివాదాలు కలుగుతాయి. కొందరి మాటల వలన మానసిక సమస్యలు కలుగుతాయి వ్యాపారాలలో భాగస్వాములతో మాటపట్టింపులు ఉంటాయి నిరుద్యోగులకు అధిక శ్రమతో కాని ఫలితం అందదు.

మకర రాశి (Capricorn) :

గృహమున వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన వాహన భూ లాభాలు. ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు.

కుంభ రాశి (Aquarius) :

శ్రమతో కూడిన దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభన కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

మీన రాశి (Pisces) :

అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది దాయాదులతో స్ధిరాస్తి వివాదాల పరిష్కారం అవుతాయి శుభకార్యాల కొరకు ధనం ఖర్చు చేస్తారు. సంఘంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి :

Also Read  : Weekly Horoscope : ఈ వారం రాశి ఫలాలు 22-08-2021 నుంచి 28-08-2021 వరకు

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 26-08-2021 గురువారం… నేటి పంచాంగం…

తాజా సమాచారం కోసం మాసిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి
Https://Www.Facebook.Com/SirimalliPage