2024-07-27 02:20:05
Today Horoscope : 13-05-2021 గురువారం నేటి రాశిఫలాలు…. – Sirimalli.com

Today Horoscope : 13-05-2021 గురువారం నేటి రాశిఫలాలు….

Today Horoscope : 13-05-2021 గురువారం నేటి రాశిఫలాలు : ఈ రోజు వివిధ రాశుల(Today Horoscope)ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

SREE KRUPA (13-05-2021) రాశి ఫలితాలు

మేషం :

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయటా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి.

వృషభం :

గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు నిర్వహిస్తారు. గృహమునకు సన్నిహితుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్ధిరాస్తి వ్యవహారాలలో వివాదాలు రాజీ చేసుకుని ఆర్థిక లాభాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో నూతనఆలోచనలు అమలుచేస్తారు. వృత్తిఉద్యోగాలలో మరింత రాణిస్తారు.

మిధునం :

చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలుగుతుంది. ఆస్థి ఒప్పందాలు వాయిదా వేస్తారు. ప్రయానాలు వాయిదా వేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రం సాగుతాయి. వ్యాపారపరంగా శ్రమకు తగిన ఫలితం ఉండదు వృత్తి ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురవుతారు.

కర్కాటకం ;

బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థికవాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల ప్రశంసలు అందుకుంటారు.వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

సింహం :

వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధార్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

కన్య :

చేపట్టిన పనులు లో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. అవసరానికి డబ్బు అందడంలో ఇబ్బందులు ఉంటాయి సన్నిహితులతో అకారణంగా విభేదిస్తారు. శారీరక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.

తుల :

దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో భాగస్వామ్య ఒప్పందాలు ఆకస్మికంగా మార్పుచేస్తారు. వృత్తిఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్ధిక సమస్యలుంటాయి.

వృశ్చికం :

సంఘంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి కుటుంబ సభ్యుల నుండి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది డబ్బు విషయంలో లోటు ఉండదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

ధనస్సు :

ఇంటబయట పలుకుబడి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో స్ధిరాస్తి తగాదాలను రాజీ చేసుకుంటారు. వ్యాపారమున ఆలోచనలు కలసి వస్తాయి. ఉద్యోగమున పురోగతి సాధిస్తారు.

మకరం :

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

కుంభం :

ఆర్థిక వాతావరణం నిరాశాజనకంగా ఉంటుంది.చేపట్టిన పనులలో శ్రమ పెరిగినప్పటికీ నిదానంగా పూర్తవుతాయి సోదర వర్గం నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్థుల ప్రవర్తనచికాకుకలిగిస్తుంది. ఉద్యోగమునతొందరపాటు నిర్ణయాలు చేస్తారు.

మీనం :

బంధువుల నుంచి వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

Girish-(Purohithulu) Sirimalli.com
Girish (Purohithulu) sirimalli.com

GIRISH KULKARNI (PUROHITULU)

Ph – 9440933824

email:- girishmaharaj824@gmail.com

ఇవి కూడా చదవండి : 

Also Read : Today Amrutha Gadiyalu : అమృత ఘడియలు, శుభ సమయములు.. ఈ రోజు అమృత ఘడియలను చూస్తే..

Also Read : Today Panchangam : 13-05-2021 గురువారం .. నేటి పంచాంగం

తాజా సమాచారం కోసం మా సిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/SirimalliPage